
ప్రజా ఉద్యమం
పోరు ఉధృతం చేయనున్న వైఎస్సార్‌సీపీ
కోటి సంతకాల సేకరణ, రచ్చబండ ద్వారా గ్రామస్థాయిలోకి..
కోటి సంతకాల సేకరణ పోస్టర్లు ఆవిష్కరణ
సాక్షి, పార్వతీపురం మన్యం:
రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన పోరు మరింత తీవ్రం కానుంది. ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణంలో ప్రైవేటు భాగస్వామ్యం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ.. ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేసే లా సుదీర్ఘ ఉద్యమ కార్యాచరణకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. గ్రామగ్రామానికి వెళ్లి దాదాపు 45 రోజు లపాటు కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్య క్రమాలను ఆ పార్టీ నేతలు చేపట్టనున్నారు.
నాలుగు నియోజక వర్గాల్లోనూ కార్యక్రమాలు
పేదలకు నాణ్యమైన వైద్యం, విద్యార్థులకు వైద్య విద్యను అందించాలన్న సదుద్దేశంతో గత వైఎస్సా ర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు మంజూరు చేశారు. అందులో ఐదు కళాశాలలు నిర్మాణాలు కూడా పూర్తి చేసుకుని తరగతులను సైతం ప్రారంభించాయి. వెనుకబడిన ప్రాంతం, గిరిజన జనాభా అధికంగా ఉండే పార్వతీపురం మన్యం వంటి జిల్లాకూ మలి విడతలో కళాశాలను ప్రారంభించాల్సి ఉంది. రూ. 600 కోట్లతో పరిపాలన అనుమతులు కూడా ఇచ్చా రు. అనుబంధంగా పార్వతీపురం, సీతంపేటల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వంలోనే శరవేగంగా నిర్మాణాలు జరిగా యి. ప్రభుత్వం మారడంతో ఆ పనులు కూడా అర్థాంతరంగా నిలిచిపోయాయి. జిల్లాకు వైద్య కళాశాల అనుమతులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు పీపీపీ విధానంలో ప్రైవేటుకు కట్టబెడుతోంది. ఈ నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీతో పాటు.. పలు ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసు కెళ్లేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నా యి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్లను శుక్రవా రం నియోజక వర్గాల్లో ఆయా నాయకులు ఆవిష్కరించారు. నవంబర్ 22వ తేదీ వరకు ‘రచ్చబండ’ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈనెల 28న నియోజకవర్గాల్లోనూ, నవంబర్ 12న జిల్లా కేంద్రంలో ర్యాలీలు చేపట్టనున్నారు. మేధావి వర్గాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలను సమన్వ యం చేసుకుంటూ 45 రోజుల పాటు కోటి సంతకా లు సేకరించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 25న జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో గవర్నర్‌కు కోటి సంతకాలను అందజేయనున్నారు. ప్రజా ఉద్యమంలో అన్ని వర్గాలూ భాగస్వామ్యం కావాలని పార్టీ నాయకులు పీడిక రాజన్నదొర, పాముల పుష్ప శ్రీవాణి, అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి కోరారు.
పాలకొండ: వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పాలకొండ నియోజకవర్గం పరిధిలో కోటి సంతకాల సేకరణ పోస్టర్లను ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కనపాక సూర్యప్రకాష్‌రావు, వెలమల మన్మథరావు, పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.