
ఖాకీల వేధింపుల నుంచి రక్షణ కావాలి
● ఏఎస్పీ సౌమ్యలతకు బాధితుడి మొర
విజయనగరం క్రైమ్: బొబ్బిలి పోలీసుల నుంచి తనను కాపాడాలంటూ విజయనగరం డీపీఓలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఓ ఫిర్యాదుదారు మొర పెట్టుకున్నాడు. నా భార్య ప్రవర్తన బాగోలేదు..నాకు నా కొడుకు భవిష్యత్తే ముఖ్యం..భార్య వద్దు కొడుకును పంపను. కోర్టులో కేసు నడుస్తున్నా..బొబ్బిలి పోలీసులు తనను పిలిచి వేధిస్తున్నారంటూ ఏఎస్పీ సౌమ్యలతకు ఫిర్యాదు చేసి ఓ బాధితుడు వాపోయాడు. ౖపైళ్లె ఏడేళ్లు అవుతున్నప్పటికీ తన భార్య ప్రవర్తన బాగోలేక ఏడేళ్ల కొడుకు భవిష్యత్తు కోసం విడాకులు కోరుకున్నానని బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి సమక్షంలో కోర్టులో కేసు నడుస్తోందని ఫిర్యాదు దారు ఓరుగంటి కమల్ బాబు డాక్యుమెంటల్ ఎవిడెన్స్‌తో తన బాధ, వెళ్లగక్కాడు. తాను బొబ్బిలిలో ఉంటూ ఏసీ రిపేర్ పనులు చేసుకుంటూ కొడుకును చూసుకుంటున్నానని, కానీ విడాకుల కేసు కోర్టులో ఉండగానే తిరిగి తన భార్య వేధిస్తోందని బొబ్బిలి స్టేషన్‌లో కేసు కూడా నడుస్తోందని తనకు న్యాయం చేయాలని ఏఎస్పీకి ఫిర్యాదు చేశాడు. తక్షణమే బొబ్బిలి ఎస్సై రమేష్‌పై చర్యలు తీసుకోవాలని ఏఎస్పీని వేడుకున్నాడు. ఈ మేరకు ఫిర్యాదు దారు సమస్య విన్న ఏఎస్పీ సౌమ్యలత వెంటనే బొబ్బిలి పోలీసులతో మాట్లాడి కేసు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.