విలక్షణం.. గిరిజన జీవనం | - | Sakshi
Sakshi News home page

విలక్షణం.. గిరిజన జీవనం

Aug 8 2024 1:18 AM | Updated on Aug 8 2024 1:18 AM

విలక్

విలక్షణం.. గిరిజన జీవనం

పార్వతీపురం మన్యం
గురువారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2024

ప్రస్తుత సమాజం ఆధునిక పుంతలు తొక్కుతున్నా.. వారు మాత్రం ఆచారాలను కాపాడుకుంటూ

భావితరాలకు అందిస్తున్నారు.

ఎండైనా..వానైనా.. రాయనక..

రప్పనక..కొండనక..కోననక..

కష్టం ఎంతైనా చెదరని చిరునవ్వు.. తరాలు మారినా, మరువని సంస్కృతి అడవితల్లి బిడ్డలకే సొంతం. చెట్టూచేమలను

నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు నేటికీ సజీవ సాక్ష్యంగా ఉన్నాయి.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రేపు. వారికంటూ ప్రత్యేకమైన రోజు ఇది.

–సాక్షి, పార్వతీపురం మన్యం/సీతంపేట

గత ప్రభుత్వ హయాంలో గిరిజన సంక్షేమానికి పెద్దపీట

కోట్లాది రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పన

గిరిజన విశ్వవిద్యాలయం, ఇంజినీరింగ్‌ కళాశాల నిర్మాణానికి చర్యలు

మారిన పరిస్థితులు గిరిపుత్రులకు పునరావృతమవుతున్న కష్టాలు

వైద్యమూ అందని దుస్థితి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రేపు

పార్వతీపురం మన్యం జిల్లాలో రెండు ఐటీడీఏలు ఉన్నాయి. కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట, సాలూరు, మక్కువ, సీతంపేట, కురుపాం తదితర మండలాల్లో ఉన్న కొండలపై వందల సంఖ్యలో గిరిజన గ్రామాలున్నాయి. ఎక్కడో దూరాన విసిరేసినట్లు ఉండే ఈ గ్రామాల్లో గడిచిన ఐదేళ్ల క్రితం వరకు కనీసం రహదారి సౌకర్యం కూడా ఉండేది కాదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో రూ.కోట్లు వెచ్చించి మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం రహదారులు వేశారు. దీంతో వారికి రవాణా సమస్యలు తప్పాయి. గతంతో పోల్చుకుంటే డోలీ మోతలు చాలావరకు తగ్గాయి. కొన్ని ప్రభుత్వాలు వారిని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తుండడం వల్ల వారికి దక్కాల్సిన ఫలాలు మైదాన ప్రాంతాలకు తరలిపోతున్నాయి.

ఉన్నత విద్య కల సాకారమయ్యేనా?

గిరిజనులకు గుర్తింపుగా.. గిరిజన కుటుంబాల్లో విద్యాదీపం వెలిగించేలా ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం కింద అప్పటి ఉమ్మడి విజయనగరం జిల్లాకు గిరిజన విశ్వవిద్యాలయం మంజూరైంది. గిరిజనులకు అందుబాటులో ఉండేలా..గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మెంటాడ, దత్తిరాజేరు మండలాల మధ్య 561.88 ఎకరాలను సేకరించింది. మౌలిక సదుపాయాల కల్పనకు, రైతులకు నష్టపరిహారం కోసం రూ.430 కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది ఆగస్టులో నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహ న్‌రెడ్డితో కలిసి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించాల్సి ఉన్న సమయంలో..ప్రస్తుత కూటమి ప్రభుత్వం గిరిజనులపై కక్ష సాధింపు అన్నట్లుగా విశ్వవిద్యాలయాన్ని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి వద్దకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది. ఇది ము మ్మాటికీ గిరిజనులను మోసగించే చర్యే అన్న అభిప్రా యం గిరిజన సంఘాల నుంచి వ్యక్తమవుతోంది.

మరోవైపు గిరిజన కుటుంబాల్లోని ప్రతి విద్యార్థికీ ఉన్నత విద్యావకా శాలు కల్పించాలన్న ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కురుపాం నియోజకవర్గంలోని టేఖరఖండి వద్ద గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాలను తలపెట్టింది. దాదాపు 105 ఎకరాల విస్తీర్ణంలో రూ.190 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టింది. సుమారు 80 శాతం పనులు ఇప్పటి కే పూర్తయ్యాయి. ఇంకా మిగులు పనులపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టలేదు.

వైద్యం అందని ద్రాక్ష కారాదు..

జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, జియ్యమ్మవలస, సాలూరు, భామిని, సీతంపేటలోని కొన్ని మారుమూల గ్రామాలకు ఊటనీరే దిక్కవుతోంది. సురక్షిత నీరు అందకపోవడం వల్ల ప్రజలు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. వర్షాల సీజన్‌ వచ్చిందంటే గిరిజన ప్రాంతాల్లోని ఆస్పత్రులు కిటకిటలాడిపోతాయి. ప్రస్తుతం మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ రోగుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. జిల్లాలో 37 పీహెచ్‌సీలుండగా..ఒక్కో ఆస్పత్రిలో రోజుకు కనీసం 80కిపైగా ఓపీ నమోదవుతోంది. జిల్లా ఆస్పత్రిలో 500 వరకు ఓపీ ఉంటోంది. ప్రస్తుతం సరైన వైద్య సదుపాయం గిరిజ నులకు అందడం లేదు. మందులు అందుబాటులో లేవు. గత నెలలోనే ఇద్దరు చిన్నారులు మరణించ డం కలవరపాటుకు గురి చేస్తోంది. రక్తహీనత, సికిల్‌సెల్‌ ఎనీమియా వంటివి గిరిజనులను పీడిస్తున్నాయి. జిల్లాలోని గిరి ప్రాంతాల్లో 200 మందికిపైగా గిరిజనులు సికిల్‌సెల్‌ ఎనీమియాతో బాధ పడుతున్నారు. జిల్లాకో వైద్య కళాశాల మంజూరుకు గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గిరిజనులకు నాణ్యమైన, మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో రూ.600 కోట్లతో వైద్యకళాశాలను నిర్మిస్తామని ప్రకటించింది. పార్వతీపురం, సీతంపేటలలో రూ.50 కోట్ల చొప్పున వ్యయంతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం జరగాల్సి ఉంది. ఇవి పూర్తయితే, గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి. కూటమి ప్రభుత్వం దాన్ని కొనసాగించాలని గిరిజనులు కోరుతున్నారు. గతంలో ‘ఫ్యామిలీ డాక్టర్‌’ పేరిట వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గిరిజనుల ముంగిటకే వైద్యసేవలను తీసుకెళ్లింది. 29 వాహనాలను జిల్లాకు కేటాయించి, వాటిలో 67 రకాల మందులను అందుబాటులో ఉంచి వైద్యసేవలందించింది. నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.

నాడు మౌలిక సదుపాయాలకు పెద్దపీట

గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. పీఎంజీఎస్‌వై, ఆర్‌సీఈపీఎల్‌డబ్ల్యూ తదితర గ్రాంట్ల కింద 1,008 రహదారి పనులు రూ.1,260 కోట్లతో చేపట్టారు. గిరిజన ప్రాంతాలకూపెద్దఎత్తున రహదారులు నిర్మించారు. 58 రహదారులకు అటవీ అనుమతులు మంజూరయ్యాయి. 163 కిలోమీటర్ల మేర 84 బీటీ రోడ్లను గిరిజన ప్రాంతాల్లో నిర్మించారు. ప్రధానంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో సమాచార వ్యవస్థను మెరుగుపర్చేందుకు 196 4జీ సెల్‌ టవర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీ రు అందించాలన్న ఉద్దేశంతో జిల్లాలోని సుమా రు 1,503 గ్రామాల్లో జల్‌జీవన్‌ మిషన్‌ కింద 1,937 పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు.

పోడు హక్కుతో ఓ ధైర్యం

2019కి ముందు టీడీపీ ప్రభుత్వం హయాంలో గిరిజన రైతులు పోడు భూములపై సాగు మాత్రమే చేసుకునేవారు. వారికి ఎటువంటి హక్కు పత్రాలూ ఉండేవి కావు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే గిరిజనుల దశ మారింది. సాగు భూములకు హక్కులు కల్పించారు. కురుపాం నియోజకవర్గంలో 32,300 మందికి 68,811.78 ఎకరాలకు సంబంధించి ఆర్‌వోఎఫ్‌ఆర్‌, డీకేటీ పట్టాలను అందజేశారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని సబ్‌ప్లాన్‌ మండలాల్లో 25,750 ఎకరాల విస్తీర్ణంలో 17,139 మందికి ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పంపిణీ చేశారు. సాలూరు నియోజకవర్గంలోనూ గిరిజనులకు పెద్ద ఎత్తున పోడు హక్కులు కల్పించారు. ఫలితంగా వారికి ప్రభుత్వం నుంచి సాగు రాయితీలు, రైతు భ రోసా సొమ్ము అందేవి. వీటిని కొనసాగించాల్సిన ఆవశ్యకత కూటమి ప్రభుత్వంపై ఉంది.

కట్నాలు లేని వివాహాలు..

ఆదివాసీ ప్రాంతాల్లో వివాహ ఆచా రం వింతగా ఉంటుంది. మైదాన ప్రాంతంలో వరకట్న భూతం వెంటా డుతున్న నేటి రోజుల్లో ఇందుకు భిన్నంగా ఆది వాసీ గ్రామాల్లో వరుడి కుటుంబసభ్యులు వధువు కుటుంబానికి ఓలి (తిరిగికట్నం) ఖర్చుల నిమిత్తం ఇచ్చే ఆచారం ఉంది. ఆదివాసీలు నిరంతర శ్రమజీ వులు, అయినా తీరిక వేళల్లో మాత్రం ఆటపాటలు, ఆనందాలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. పండగలు పబ్బాలు వస్తే గిరిజన గూడాల్లోని ప్రజలకు పట్టరా ని సంతోషం. ఉన్న దాంట్లోనే అందరూ కలిసి కందికొత్తలు, ఆగం, టెంకపండగలను డప్పుల వాయిద్యాలతో నిర్వహిస్తారు.

గిరిజనుల ప్రధాన డిమాండ్లు ఇవీ..

గిరిజన చట్టాలను, రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలి.

ఆదివాసీల ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతి, భాష, యాస, కట్టుబాట్లను

కాపాడాలి.

రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలి.

గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్‌

గ్రామాలుగా ప్రకటించాలి.

అటవీ భూములు, మిగులు ప్రభుత్వ

బంజర భూములకు సంబంధించి గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి.

భూములు ఉన్న గిరిజనులకు కూటమి ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత పథకం

కింద తక్షణం రూ.20 వేలు ఇవ్వాలి.

గిరి ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న,

మంజూరైన రహదారులు, వంతెనలను త్వరితగతిన పూర్తి చేయాలి.

గిరిజన యూనివర్సిటీని గిరిజన నియోజకవర్గంలోనే నిర్మించాలి.

కురుపాంలో ఉన్న గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి. విద్య, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలను త్వరితంగా చేపట్టాలి.

కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా మూడు సెంట్ల స్థలంలో పక్కా ఇళ్లు నిర్మించాలి. గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీని నిర్వహించాలని ఆదివాసీ గిరిజన సంఘాలు కోరుతున్నాయి.

మళ్లీ కొండ దిగాల్సిందేనా..?

లబ్ధిదారుల చెంతకే రేషన్‌ సరుకులు అందించేలా గత ప్రభుత్వం ఎండీ యూ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ముఖ్యంగా గిరిజనుల కు ఇది ప్రయోజనకరంగా ఉండేది. సీతంపేట, సాలూరు, గుమ్మలక్ష్మీపురం, మక్కువ తదితర ప్రాంతాల్లో ఎత్తయిన కొండలపై ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు కొండ దిగి రావాలంటే సుమారు 3, 4 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒక్క సీతంపేట ఏజెన్సీలోనే మొత్తం 542 గిరిజన గ్రామాలుండగా..వాటిలో 250కిపైగా గ్రామాలు కొండలపైన ఉన్నవే. రేషన్‌ డోర్‌ డెలివరీ విధానం వల్ల దాదాపు గ్రామాల సమీపానికి వాహనాలు వెళ్లి సరుకులు అందించేవి. దీనివల్ల గిరిజనులకు శ్రమ తప్పేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గిరిజన ప్రాంతాలకు ఎండీయూ వాహనాల సేవలను నిలుపు చేసింది. దీంతో వారు మళ్లీ సరకుల కోసం కొండ దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అక్షరాలే ఆరాద్యదేవతలు

ఏజెన్సీ ప్రాంతాల్లో వైవిధ్యముంది. ఇక్కడ అక్షరాల ను ఆరాధ్యదేవతలుగా గిరిజనులు పూజిస్తారు. ఏజెన్సీలో అక్షరబ్రహ్మ, మడిబ్రహ్మ వంటి ఆలయాలు వెలిశాయి. అక్కడ గిరిజనులు ప్రతి గురువారం పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పితృదేవతలకు పూజలు చేసినా నైవేద్యంగా నాటు సారా పెట్టి పూజ అనంతరం పూటుగా సారా సేవిస్తారు. జీలుగు సారా వంటివి చెట్టునుంచి దించితే ముందుగా తెడ్లతో సేవిస్తారు. వారి పండగలు, సంప్రదాయాలను బొమ్మల రూపంలో వేయడంలో వారికి వారేసాటి. సవర లిపి ద్వారా కొంతమంది ఆదిమ గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. వీరు వేసే లిపికి మైదాన ప్రాంతాల్లోమంచి డిమాండ్‌ ఉంది. ఇటీవల కాలంలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు.

ఆహారపు అలవాట్లు..

ఆదివాసీలు ప్రధానంగా దంపుడు బియ్యం, గంటె, జొన్న, కొర్ర, జీలుగ పిండితో జావ చేసుకుని తాగుతారు. వీటితో పాటు అటవీ ప్రాంతంలో లభించే పలు రకాల ఆకు, దుంపకూరలను సైతం ఆహారపు అలవాటుగా తింటారు. ప్రధానంగా బొదండం కూర, చిట్టికూ ర, గురుంకూర, పుల్లేరుగుడ్లును కూరగా వండి తింటారు. మైదాన ప్రాంతాలకు భిన్నంగా ఆదివాసీల ఆహారపు అలవాట్లు ఆసక్తికరంగా ఉంటాయి.

విలక్షణం.. గిరిజన జీవనం1
1/9

విలక్షణం.. గిరిజన జీవనం

విలక్షణం.. గిరిజన జీవనం2
2/9

విలక్షణం.. గిరిజన జీవనం

విలక్షణం.. గిరిజన జీవనం3
3/9

విలక్షణం.. గిరిజన జీవనం

విలక్షణం.. గిరిజన జీవనం4
4/9

విలక్షణం.. గిరిజన జీవనం

విలక్షణం.. గిరిజన జీవనం5
5/9

విలక్షణం.. గిరిజన జీవనం

విలక్షణం.. గిరిజన జీవనం6
6/9

విలక్షణం.. గిరిజన జీవనం

విలక్షణం.. గిరిజన జీవనం7
7/9

విలక్షణం.. గిరిజన జీవనం

విలక్షణం.. గిరిజన జీవనం8
8/9

విలక్షణం.. గిరిజన జీవనం

విలక్షణం.. గిరిజన జీవనం9
9/9

విలక్షణం.. గిరిజన జీవనం

Advertisement
 
Advertisement
Advertisement