కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం ఇదే అదనుగా అన్నదాతలను దోచుకుంటున్న దళారులు కనీస మద్దతు ధర రూ.2,400 ఉన్నా.. రైతుకు దక్కేది కేవలం రూ.1,700 ఇప్పటికే పంట దిగుబడి లేక దిగులు చెందుతున్న అన్నదాతలు హాజరుకానున్న వైఎస్సార్‌సీపీ నేతలు, ఇతర పార్టీల నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు
మొక్కజొన్న రైతులకు
చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యంపై నేడు రొంపిచర్ల మార్కెట్ యార్డ్‌లో ‘రైతు ధర్నా’
సాక్షి, నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వంలో దగా పడ్డ రైతుల పక్షాన నిలిచి పోరాడేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. విత్తనాలు, ఎరువులు, పండించిన పంటలకు గిట్టుబాట ధర వంటి సమస్యలతో ప్రస్తుతం అన్నదాతలు ఇప్పటికే నానా అవస్థలు పడుతున్నారు. వీటిపై పలు నిరసన కార్యక్రమాలు చేపట్టి చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచింది. ఇప్పుడు పండించిన మొక్కజొన్న పంటను అమ్ముకోలేకపోతున్న రైతులు ఆవేదన చెందుతున్నారు. వారి సమస్యలపై ‘రైతు ధర్నా’ పేరిట నేడు రొంపిచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ నిరసన కార్యక్రమంలో జిల్లాలోని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనేతలతోపాటు ఇతర పార్టీల నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు సిద్దమవుతున్నారు. గ్రామాల నుంచి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున రైతులు ట్రాక్టర్లలో తరలిరానున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీలో సాధారణ సాగు 27,065 ఎకరాలు కాగా... 1,34,348 ఎకరాల్లో మొక్కొజొన్న సాగైంది. కనీస మద్దతు ధర రూ.2,400 కాగా, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు కేవలం రూ.1,600 నుంచి రూ.1,700 వరకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు క్వింటాకు రూ.800 – రూ.700 వరకు నష్టపోతున్నారు.


