మద్దతు ధర రూ.2,400గా ప్రభుత్వం ప్రకటించడంతో ఈ ఏడాది మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశా. పంట చేతికి వచ్చేసరికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని ఆశించా. అయితే కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు రూ.1,600 నుంచి రూ.1,700 వరకు అడుగుతున్నారు. ఈ ధరలతో అమ్మితే పెట్టుబడి రాకపోగా... కౌలు డబ్బులు కూడా చెల్లించడం కష్టం. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
– గానుగపంట సుబ్బారెడ్డి, బుచ్చిబాపనపాలెం, రొంపిచర్ల మండలం


