గుడిసెలోకి దూసుకెళ్లిన కారు | - | Sakshi
Sakshi News home page

గుడిసెలోకి దూసుకెళ్లిన కారు

Apr 17 2026 11:08 AM | Updated on Apr 17 2026 11:08 AM

తప్పిన పెను ప్రమాదం

చిలకలూరిపేట టౌన్‌: పట్టణ పరిధిలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం తప్పింది. చిలకలూరిపేట నుంచి నరసరావుపేట వైపు వేగంగా వెళ్తున్న కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న ఒక గుడిసెలోకి దూసుకెళ్లింది. తెలంగాణ రిజిస్ట్రేషన్‌ కలిగిన కారు చిలకలూరిపేట–నరసరావుపేట రహదారిపై అతివేగంగా ప్రయాణిస్తూ పొలిరెడ్డిపాలెం వద్దకు రాగానే అదుపుతప్పింది. ఒక్కసారిగా రోడ్డు పక్కకు దూసుకుపోయి అక్కడే ఉన్న గుడిసెను బలంగా ఢీకొట్టింది. కారు వేగానికి గుడిసె పాక్షికంగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తులు వాహనాన్ని అక్కడే వదిలేసి చీకట్లో పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్‌ఐ చెన్నకేశవులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement