మొక్కజొన్న కనీస మద్దతు ధర రూ.2,400గా ప్రకటించడంతో ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా సుమారు 1.34 లక్షల ఎకరాల్లో పంట సాగు చేశారు. విత్తనాలు మొదలు ఎరువులు, పురుగుమందుల కొరతతో రైతులకు పెట్టుబడి భారీగా పెరిగింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో దళారులు రైతులను దగా చేస్తున్నారు. దీనికి నిరసనగా నేడు ఉదయం 9 గంటలకు రైతు ధర్నాకు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. ఇందులో పెద్ద ఎత్తున రైతులు, రైతు కూలీలు, రైతు సంఘాల నేతలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలి.
– డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి,
నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే


