మద్దతు ధర, తూకంలో మోసం | - | Sakshi
Sakshi News home page

మద్దతు ధర, తూకంలో మోసం

Apr 17 2026 11:08 AM | Updated on Apr 17 2026 11:08 AM

మద్దతు ధర, తూకంలో మోసం

ఈ ఏడాది ఆరు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఎకరానికి సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి అయ్యింది. ఇంటికి చేరిన పంటను అమ్ముకోవాలంటే తక్కువ ధరకే వ్యాపారులు అడుగుతున్నారు. రూ.1,700 రేటుకు అమ్ముకున్నా బస్తాకు రూ.700 వరకు నష్టపోతున్నాం. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తూకంలో సైతం మోసాలు తప్పడం లేదు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే మాలాంటి రైతులు అప్పులపాలు కావాల్సిందే.

– శ్యాగంరెడ్డి పెద్ద వెంకటరెడ్డి,

బెహారావారిపాలెం, రొంపిచర్ల మండలం

Advertisement
 
Advertisement
Advertisement