మెక్కేస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

మెక్కేస్తున్నారు!

Apr 16 2026 10:30 AM | Updated on Apr 16 2026 10:30 AM

మెక్కేస్తున్నారు! చంద్రబాబు సర్కార్‌ నిర్వాకంతో దోచుకుంటున్న దళారులు సత్తెనపల్లి: ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పండించిన పంటలకు మార్కెట్‌లో మద్దతు ధర లేదు. దిగుబడి అరకొర వచ్చినా పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కల కష్టానికి విలువ లేదా అని కన్నీటి పర్యంతమవుతున్నారు. మొక్కజొన్న దిగుబడులను ఇళ్ల వద్ద రాశులుగా పోసుకొని మద్దతు ధర కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రైతులు ఇబ్బంది పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదు. సర్కార్‌ దృష్టికి తీసుకెళ్లి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించాల్సిన పల్నాడు జిల్లాలోని టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కౌలు రైతులే ఎక్కువ మొక్కజొన్నకు మద్దతు ధర క్వింటా రూ.2,400 ఉంది. అయితే మార్కెట్లో రూ. 1500–రూ.1,700 లభిస్తుంది. రూ. 700– రూ 900 వరకు రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. రబీ సీజన్‌లో పల్నాడు జిల్లాలో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. దాదాపు అన్ని మండలాల్లో ఎంతో కొంత సాగు చేపట్టారు. వీరిలో కౌలు రైతులే ఎక్కువగా ఉన్నారు. పెట్టుబడి భారం జిల్లాలో రబీ సీజన్‌లో సాధారణ మొక్కజొన్న సాగు 27,065 ఎకరాలు మాత్రమే ఉండగా .. ఇప్పుడు 1,32,510 ఎకరాల్లో సాగైంది. మొత్తం 60,777 మంది సాగు చేశారు. ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది .విత్తనాలు ,రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కోత, నూర్పిడి తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 25 వేల నుంచి రూ. 35 వేల వరకు రైతులు వెచ్చించారు. ఎకరాకు 40 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా 25 నుంచి 30 క్వింటాళ్ల లోపే వచ్చింది. ఎకరాకు రూ.వేల పెట్టుబడి పెట్టి కష్టించి పండించినా మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఆ‘ధర’ణ కరువు ...

చంద్రబాబు ప్రభుత్వం మార్చి 16 నుంచి 25 వరకు రైతన్న మీ కోసం కార్యక్రమం నిర్వహించింది. మొక్కజొన్నలకు ధర పడిపోయిందని, వెంటనే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని అన్ని గ్రామాల్లో రైతులు కోరారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రైతులు ఎంత మొత్తుకున్నా సర్కారు చేతులెత్తేసింది. ఆ దిశగా కనీసం ఎలాంటి చర్యలు లేవు. 2025–26 రబీలో జిల్లాలోని అన్ని మండలాల్లోనూ మొక్కజొన్న సాగైంది. ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం పట్ల సర్వత్రా ఆందోళన వెల్లువెత్తుతోంది.తెలంగాణలో 2025–26 ఖరీఫ్‌ సీజన్‌తోపాటు రబీ సీజన్‌లో పండించిన మొక్కజొన్నలను అక్కడి ప్రభుత్వం మద్దతు ధర రూ. 2,400 ప్రకారం కొనుగోలు చేసింది. పొరుగు రాష్ట్రంలో కొనుగోలు చేస్తుంటే ఇక్కడి ప్రభుత్వం మాత్రం రైతులను కష్టాల్లోకి నెట్టింది. ఆదుకోవాలని అన్ని ప్రాంతాల్లోని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నా పట్టించుకోవడం లేదు.

జిల్లాలో

మొక్కజొన్న సాగు

వివరాలు

‘మొక్కజొన్న’లోనూ
చంద్రబాబు సర్కార్‌ నిర్వాకంతో దోచుకుంటున్న దళారులు

ఆరుగాలం శ్రమించే రైతులు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోతున్నారు. రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నారు. రబీ సీజన్‌లో మొక్కజొన్న సాగు చేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొనుగోలు కేంద్రాల జాడ లేక దళారులు దోచుకుంటున్నారు. తక్కువ ధరలకు విక్రయించలేక కొందరు కల్లాల్లోనే ఆరబెట్టి ప్రభుత్వం ఏదో ఒక రోజు కొనుగోలు చేస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.

రబీలో సాధారణ సాగు : 27,065 ఎకరాలు

రైతుకు

కలుగుతున్న నష్టం : రూ. 900

రబీలో సాగైన పంట : 1,32,510

ఎకరాలు

ప్రస్తుతం

మార్కెట్‌లో

క్వింటా:

రూ. 1,500

సాగు

చేసిన రైతుల : 60,777

మంది

మొక్కజొన్న పంటకు కనీస

మద్దతు ధర కరువు

నేటికీ జాడ లేని కొనుగోలు కేంద్రాలు

ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతలు

పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

క్వింటాపై రూ. 800 –రూ. 900 వరకు నష్టపోతున్న రైతులు

Advertisement
 
Advertisement
Advertisement