22న శాప్‌ ఆటల పోటీలు | - | Sakshi
Sakshi News home page

22న శాప్‌ ఆటల పోటీలు

Apr 16 2026 10:30 AM | Updated on Apr 16 2026 10:30 AM

నరసరావుపేట ఈస్ట్‌: యువ క్రీడాకారులలోని ప్రతిభను వెలికి తీసేందుకు శాప్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నెలవారీ క్రీడా పోటీలలో భాగంగా ఈనెల 22వ తేదీన సత్తెనపల్లి రోడ్డులోని డీఎస్‌ఏ స్టేడియంలో ఫుట్‌బాల్‌, బాక్సింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్‌ అండర్‌ 15, యూత్‌ అండర్‌ 21 బాలబాలికల విభాగాలలో ఫుట్‌బాల్‌, యూత్‌ అండర్‌ 15, అండర్‌ 19 బాలబాలికల విభాగంలో బాక్సింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ వివరాలను శాప్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న క్రీడాకారులు మాత్రమే పోటీలో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. ఆధార్‌ కార్డ్‌ ఇతర వివరాలతో ఈనెల 21వ తేదీ రాత్రి 12 గంటలలోపు నమోదు చేసుకోవాలన్నారు.

టీపీబీఓ రసూల్‌ సస్పెన్షన్‌

నెహ్రూనగర్‌: నగరంలో అక్రమ, అనధికార నిర్మాణాలను ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని, పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర ్శులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్‌ మయూర్‌ అశోక్‌ హెచ్చరించారు. నగరంలో ఎక్కడైనా అక్రమ కట్టడం జరుగుతున్నట్లు గుర్తించి తగిన వివరాలతో 9849908391 నంబర్‌కు ఫిర్యా దు చేస్తే పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏటుకూరురోడ్‌లోని కమ్మ శేషయ్య గ్రౌండ్‌ ప్రాంతంలో బేస్‌మెంట్‌, లింటెల్‌ స్థాయిల వర కు అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీపీబీఓ (ఇన్‌చార్జి) ఎస్‌కె రసూల్‌ను సస్పెండ్‌, పర్యవేక్షణ అధికారులైన ఏసీపీ జకీరా, టీపీఓ శ్రీనివాసరావులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement