ఘనవ్యర్థాల నిర్వహణలో లక్ష్యాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

ఘనవ్యర్థాల నిర్వహణలో లక్ష్యాలు సాధించాలి

Apr 16 2026 10:30 AM | Updated on Apr 16 2026 10:30 AM

సత్తెనపల్లి: గ్రామ పంచాయతీలలో ఘన వ్యర్ధాల నిర్వహణ లక్ష్యాల నిర్దేశం, లక్ష్యసాధన కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి ఎస్‌వీ నాగేశ్వర్‌ నాయక్‌ అన్నారు. సత్తెనపల్లి మండలం నందిగామ సుప్రీం ఎల్‌టీసీలో మూడు రోజులపాటు రెసిడెన్షియల్‌ విలేజ్‌ ఇమ్మర్షన్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ ముగింపు సందర్భంగా బుధవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నాగేశ్వర్‌ నాయక్‌ మాట్లాడుతూ క్లస్టర్లలో టీమ్స్‌ వారీగా ప్రతిరోజు ఉదయం హరిత రాయబార్ల తో కలిసి చెత్త సేకరణ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. తడి చెత్త, పొడి చెత్తను ఇంటి వద్దనే వేరుచేసి సేకరిస్తున్న విధానం పై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారు కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పొడి చెత్తను వేరువేరుగా నిల్వ చేయడం, తడి చెత్త నుండి వర్మి కంపోస్టును తయారు చేయడం, తదితర అంశాల్లోని మెలకువలను గ్రహించారు. ప్రతి గ్రామపంచాయతీ తమ పరిధిలో శుభ్రత, వ్యర్ధాల నిర్వహణ, ప్రజల భాగ స్వామ్యం వంటి అంశాలపై ప్రణాళిక సిద్ధం చేయుటకు మార్గదర్శకాలు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బండి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ సుధారాణి, ప్రకాశం జిల్లా ఆర్పీలు కె.చంద్రమోహన్‌, అశోక్‌ కుమార్‌, కోనసీమ జిల్లా ఎఫ్‌టీసీ పి.మధు, మహేష్‌, పంచాయతీ కార్యదర్శులు కుంభా వెంకటేశ్వర్లు, చిలుకూరి కృష్ణ ప్రసాద్‌, అసిస్టెంట్‌ ట్రైనర్‌ చెంబేటి బొల్లయ్య, జిల్లాలోని 23 గ్రామాల పంచాయతీ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.

జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి నాగేశ్వర్‌నాయక్‌

Advertisement
 
Advertisement
Advertisement