ఘనంగా అంబేడ్కర్‌, ఫూలే, జగ్జీవన్‌రామ్‌ల జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా అంబేడ్కర్‌, ఫూలే, జగ్జీవన్‌రామ్‌ల జయంతి

Apr 15 2026 7:50 AM | Updated on Apr 15 2026 7:50 AM

బాలకోటేశ్వరుడి సేవలో ఆర్‌జేసీ రూ.26.46 కోట్లతో జలధార–జలహారతి పనులు చెస్‌ విజేతలు మాక్షరత్‌, అలేఖ్య

గుంటూరు లీగల్‌: మహనీయులు బాబూ జగ్జీవన్‌రామ్‌, జ్యోతిరావు ఫూలే, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ జయంతి వేడుకలను మంగళవారం గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో గుంటూరు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్‌ చక్రవర్తి, ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కె.ఎస్‌.జవహర్‌ హాజరయ్యారు. జిల్లా కోర్టు న్యాయమూర్తులు, బార్‌ కౌన్సిల్‌ మెంబర్స్‌ జి.శాంతకుమార్‌, వి.బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథులు సందేశాలను అందించారు. సీనియర్‌ న్యాయవాదులు వైకే, పోకల వెంకటేశ్వర్లు, వి.హృదయరాజు, సాంబిరెడ్డి, బి.అంకమ్మరావు, పి.ప్రసాద్‌, సి.వెంకటరామయ్య తదితరులు ప్రసంగించారు. బార్‌ అసోసియేషన్‌ నిర్వహించిన క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం.రేవతి, ట్రెజరర్‌ ఆకుల లక్ష్మీసుజాత, సంయుక్త కార్యదర్శి పి.ఏసుప్రసాద్‌, స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ సెక్రటరీ కుప్పాల హనుమంతరావు, లైబ్రరీ సెక్రటరీ పూదోట రాజేష్‌ లింగం, లేడీ రిప్రజెంటివ్‌ అడపా ఇందిరా, లేడీ ఎగ్జిక్యూటివ్‌ లక్ష్మీ తిరుపతమ్మ, సీనియర్‌ జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు, లాయర్లు పాల్గొన్నారు.

వేమూరు: అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని బాలకోటేశ్వర స్వామిని దేవదాయశాఖ రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయంలో పనుల నిర్వహణపై పాలకమండలి, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి పాలకమండలి కృషి చేయాలని సూచించారు. దేవస్థానం అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌ వర్మ, సిబ్బంది పాల్గొన్నారు.

నరసరావుపేట: జిల్లాలో భూగర్భ జలమట్టం పెంచేందుకు రానున్న మూడు నెలల్లో రూ.26.46 కోట్లు వెచ్చించి పనులు చేపట్టనున్నామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జలధార–జల హారతి కార్యక్రమం కింద సాగునీటి సంఘాల ద్వారా చేపట్టనున్న పనులకు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని భూగర్భ జల మట్టం మూడు మీటర్ల నుంచి ఆరు మీటర్ల మేరకు పెరిగే అవకాశం ఉందన్నారు. మొత్తం 227 చెరువులలో పూడికతీత పనులు, కాల్వల పునరుద్ధరణ పనులు చేపట్టి సాగునీటి–తాగునీటి సరఫరా, భూగర్భ జలమట్టం మెరుగుపరుస్తామన్నారు. డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి, జిల్లా భూగర్భజల శాఖ అధికారి రామ్‌ బాలాజీరెడ్డి పాల్గొన్నారు.

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): జిల్లా అండర్‌–13 ఓపెన్‌, బాలికల చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు స్థానిక నలందానగర్‌లోని మకూన్స్‌ కిడ్స్‌ ప్లే స్కూల్‌లో మంగళవారం జరిగాయి. బాలుర విభాగంలో మాక్షరత్‌ గోగినేని, మారెడ్డి తేజభరత్‌రెడ్డిలు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. బాలికల విభాగంలో జె.అలేఖ్య, జయఅలేఖ్య తన్నీరు ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందారని పోటీల నిర్వహకుడు పి.విజయ్‌ కుమార్‌ తెలిపారు. గెలుపొందిన చిన్నారులు త్వరలో మార్కాపురంలో జరగనున్న రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారన్నారు. అనంతరం జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షలు సీహెచ్‌ రవీంద్రరాజు, న్యూరో సర్జన్‌ డాక్టర్‌ సత్యారెడ్డి చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో సుమారు 120 మంది పాల్గొన్నారని పేర్కొన్నారు. స్కూల్‌ డైరెక్టర్‌ సాహితి దుగ్గింపూడి పాల్గొన్నారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement