మంట చింతల..! | - | Sakshi
Sakshi News home page

మంట చింతల..!

Apr 15 2026 7:50 AM | Updated on Apr 15 2026 7:50 AM

మంట చింతల..!

పల్నాడు జిల్లా రెంటచింతలలో మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 44.6 కనిష్ట ఉష్ణోగ్రత 29.4 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గ్రామంలో ఆది, సోమ, మంగళవారం మూడు రోజులుగా వరుసగా గరిష్ట ఉష్ణోగ్రతలు 43.1, 43.8, 44.6 డిగ్రీలు నమోదుకావడంతో గ్రామస్తులు అల్లాడిపోయారు. భానుడు ఒక్కసారిగా భగభగ మంటూ మండుతుండటంతో గ్రామం నిప్పుల కొలిమిగా మారింది. దీనికితోడు వడ గాడ్పులు వీస్తుండటంతో గ్రామస్తులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో గ్రామంలోని మాచర్ల–గుంటూరు ప్రధాన రహదారితో పాటు వ్రీధులన్నీ జనసంచారం లేక బోసిపోయాయి. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత కారణంగా వృద్ధులు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. – రెంటచింతల

Advertisement
 
Advertisement
Advertisement