దానశీలత కలిగిన రాడికల్‌ హ్యూమనిస్ట్‌ సుబ్బారావు | - | Sakshi
Sakshi News home page

దానశీలత కలిగిన రాడికల్‌ హ్యూమనిస్ట్‌ సుబ్బారావు

Apr 15 2026 7:50 AM | Updated on Apr 15 2026 7:50 AM

దానశీలత కలిగిన రాడికల్‌ హ్యూమనిస్ట్‌ సుబ్బారావు ఇంకొల్లు(చినగంజాం): రావి సుబ్బారావు దాతగా, విద్యావేత్తగా ఎంతో కృషి చేశారని భారత హేతువాద సంఘం ట్రెజరర్‌ షేక్‌ బాబు అన్నారు. ఇంకొల్లు రాడికల్‌ హ్యూమనిస్ట్‌ సెంటర్‌లో రాడికల్‌ హ్యూమనిస్ట్‌ రావి సుబ్బారావు వర్ధంతి నిర్వహించారు. భారత హేతువాద సంఘం ప్రధానకార్యదర్శి మేడూరి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. రావి సుబ్బారావు జీవితం ఉద్యమ కృషి గురించి పలువురు వక్తలు ప్రసంగించారు. 1991లో ఇంకొల్లు రాడికల్‌ హ్యూమనిస్ట్‌ సెంటర్‌ స్థాపన కోసం ఆయన తమ విలువైన 10 సెంట్ల స్థలాన్ని దానంగా ఇచ్చి హేతువాద మానవవాద ఉద్యమానికి ఆశ్రయాన్ని కల్పించారన్నారు. కార్యక్రమంలో తెలంగాణా హేతువాద సంఘ అధ్యక్షుడు కే శ్రీనివాసాచారి, ఏపీ హేతువాద సంఘం అధ్యక్షులు కరణం రవీంద్రబాబు, షేక్‌ దరియావలి, కాకి రాజశేఖర్‌, రేజేటి వెంకటేశ్వర్లు, కళ్యాణం చంద్రశేఖర్‌, నల్లమోతు రాధాకృష్ణ, అబ్రహం లింకన్‌, రాయని వీరయ్య, కాకర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని రావి సుబ్బారావుకు నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు రాడికల్‌ హ్యూమనిస్ట్‌లు రచించిన పలు గ్రంథాలను ఆవిష్కరించారు. మైక్రో ఆర్టిస్ట్‌ మహిత యువతకు ఆదర్శం బాపట్లటౌన్‌: మైక్రో ఆర్టిస్ట్‌ అన్నం మహిత యువతకు ఆదర్శనీయమని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌ తెలిపారు. అంబేడ్కర్‌ జయంతిను పురస్కరించుకొని అంబేడ్కర్‌ జీవిత చరిత్రను ఫెన్సిల్‌ లీడ్స్‌పై చెక్కి తన ప్రతిభను కనపరిచారు. ఎస్పీ మహితను ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ మాట్లాడుతూ యువత చదువుతోపాటు అరుదైన కళలలో కూడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. చీరాల వాసి అన్నం మహిత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ జీవిత చరిత్రను 50 ఫెన్సిల్‌ లీడ్స్‌పై చెక్కి ఎందరికో ఆదర్శనంగా నిలిచిందన్నారు. గతంలో గాంధీజీ చరిత్రను ఫెన్సిల్‌ లీడ్స్‌పై చెక్కినట్లు తెలిపారు. విద్యార్థి దశలోనే అరుదైన కళలపై ఆసక్తి పెంపొందించుకుని తనదైన శైలిలో ఫెన్సిల్‌ లీడ్స్‌పై మహనీయుల జీవిత చరిత్రలను చెక్కుతున్న అన్నం మహిత ప్రతిభ అభినందనీయమన్నారు. అంబేడ్కర్‌ జీవిత చరిత్ర సారాంశాన్ని ఎంతో సూక్ష్మంగా ఆ కళలో ప్రతిబింబించడం ఆసక్తికరంగా ఉందన్నారు. ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టు విడుదల

జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌

గుంటూరు మెడికల్‌: గుంటూరు ప్రాంతీయ వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం పరిధిలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఫార్మసీ అధికారుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టు విడుదల చేసినట్లు రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.శోభరాణి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టును సీఎఫ్‌డబ్ల్యూ.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్‌ వైబ్‌సైటలో అందుబాటులో ఉంచామన్నారు. ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టులు అభ్యంతరాలు ఉంటే ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు వ్యక్తిగతంగా, లేదా రిజిష్ట్రరు పోస్టు ద్వారా, లేదా ఆర్డీఎంహెచ్‌ఎస్‌గుంటూరు – జీమెయిల్‌.కామ్‌ మెయిల్‌ ద్వారా సమర్పించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement