ఆరోగ్యశ్రీ పథకంలో అదనపు వసూళ్లుకు పాల్పడుతున్న జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో టెస్ట్‌ల పేరుతో అదనపు చార్జీలను ఆసుపత్రులు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. అదనపు చార్జీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరారు.


