మహిళలు, వృద్ధుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

మహిళలు, వృద్ధుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి

Apr 14 2026 7:40 AM | Updated on Apr 14 2026 7:40 AM

● అదనపు ఎస్పీ జేవీ సంతోష్‌ ● జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ ● ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు ఆస్పత్రికి వెళ్లాలన్నా డబ్బులు ఇవ్వడం లేదు గర్భిణిని చేసి మొఖం చాటేశాడు యూ ట్యూబర్‌ వైష్ణవి గతే నీకు పడుతుంది.. యూకే పంపిస్తామని మోసం

అప్పు తీసుకుని బెదిరిస్తున్నాడు

నరసరావుపేట రూరల్‌: మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్ర స్థాయిలో విచారణ వేగంగా పూర్తిచేసి వారికి న్యాయం చేయాలని అదనపు ఎస్పీ జేవీ సంతోష్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్‌ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, పలు మోసాలతోపాటు ఆక్రమణలు, బెదిరింపులు వంటి అంశాలకు సంబంధించిన మొత్తం 95 ఫిర్యాదులు అందాయి.

భూమి విక్రయించగా వచ్చిన రూ.1.80 లక్షలు మేనల్లుడు నాగేశ్వరరావుకు అప్పుగా ఇచ్చాను. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నా. ఆస్పత్రికి వెళ్లి వైద్యం పొందటానికి అప్పుగా ఇచ్చిన డబ్బు ఇవ్వమని అడిగినా స్పందించడం లేదు. డబ్బులు ఇప్పించి నాకు న్యాయం చేయండి.

–మేకపోతుల అంకమ్మ, జమ్మలమడక, మాచర్ల మండలం

గురజాల మండలం జంగమహేశ్వరపురానికి చెందిన వర్రా చంద్రశేఖరరెడ్డి ప్రేమించానని చెప్పి గర్భిణిని చేశాడు. ఆ తరువాత ఫోన్‌కు స్పందించడం లేదు. నాకు న్యాయం చేయండి.

–ఓ యువతి

నా తండ్రికి ఇష్టం లేకపోయిన 2014లో షేక్‌ ఆషిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాను. అప్పటినుంచి అనునిత్యం నన్ను అనుమానిస్తూ శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు గురిచేస్తున్నాడు. ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని నీ మీద మోజు తీరిపోయింది వెళ్లిపోమంటూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. విడాకులు ఇవ్వాలని గత నెల 30వ తేదీన భర్త, అత్త ఇద్దరు నాపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఉంటే వైష్ణవిని చంపినట్టే చంపుతామని బెదిరిస్తున్నారు. భర్త, అత్తలపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలి.

–షేక్‌ అప్సర, ఇస్లాంపేట, నరసరావుపేట

యూకే పంపిస్తామని చెప్పి తన వద్ద రూ.20 లక్షలు తీసుకుని మోసం చేశారు. క్రోసూరు మండలానికి చెందిన గంపల హరీష్‌ మధ్యవర్తిగా ఉన్నాడు. యూకే పంపించక పోవడంతో డబ్బులు అడిగితే గతేడాది రూ.12లక్షలు ఇచ్చాడు. నెల తరువాత మిగిలిన మొత్తం ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. దీనిపై దుర్గి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదు. నగదు ఇప్పించి న్యాయం చేయండి.

–మానుపాటి రవికుమార్‌, ముటుకూరు, దుర్గి మండలం

మంగళగిరికి చెందిన పులి వెంకటలక్ష్మీప్రసాద్‌ తన వ్యాపార అవసరాల కోసం 2024 సెప్టెంబర్‌లో రూ.10లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆరు నెలల్లో తిరిగి చెల్లిస్తానని చెప్పి ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చాడు. గత సంవత్సరం నుంచి డబ్బు చెల్లించమని అడిగితే అతని పెద్ద కుమారుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడు. డబ్బు కోసం ఇంటికి వస్తే కోర్టులు చుట్టూ తిప్పుతానని బెదిరిస్తున్నాడు. ఈ టెన్షన్‌తో ఆరోగ్యం కూడా దెబ్బతింది.

–ఇంజేటి సదాశివరెడ్డి, నరసరావుపేట

Advertisement
 
Advertisement
Advertisement