సత్తెనపల్లి: ఫుట్‌బాల్ అసోసియేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా కె.సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎన్నికయ్యారు. సత్తెనపల్లిలోని శాంతినికేతన్ జూనియర్ కళాశాలలో సోమవారం పల్నాడు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఎన్నిక నిర్వహించారు. ఎన్నికకు రాష్ట్ర పరిశీలకులుగా హాజరైన కె.క్రాంతికుమార్ పర్యవేక్షణలో ఎమ్మార్ ఎల్ నరసింహారావు, ఎలక్షన్ ఆఫీసర్‌గా స్టేట్ ఈసీ మెంబర్ బి చక్రవర్తి, ఏలూరు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ సెక్రెటరీ జీఎస్‌ఎస్ పవన్‌కుమార్, శ్రీకాకుళం జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ సెక్రెటరీ నీలాద్రి, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు ఎన్.సుబ్బారావులు హాజరై పల్నాడు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సెక్రటరీగా షేక్ షమ్మీ, వైస్ ప్రెసిడెంట్ వి నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీగా పి కోటేశ్వరరావు, ట్రెజరర్‌గా ఎం.దీక్షిత, మెంబర్లుగా బి స్పందన, ఏ వెంకటసుబ్బారావు, పల్నాడు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా రిటైర్డ్ హెచ్‌ఎం సీహెచ్ వెంకటాద్రిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం జిల్లాలో ఫుట్‌బాల్ అభివృద్ధి కోసం క్రీడాకారులను జాతీయ, రాష్ట్ర క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని కోరారు. నూతన కార్యవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో శాంతినికేతన్ జూనియర్ కళాశాల డైరెక్టర్ వై.రమణారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీరామరెడ్డి, అచ్చిరెడ్డి, సుభానీ, గోవర్ధన, రన్‌హుస్సేన్, లక్ష్మి, శ్రీనివాస్‌రెడ్డి, గౌస్య, శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.


