చిత్రకారుడు వల్లెం కృష్ణకు అంతర్జాతీయ మెరిట్‌ జ్యూరీ అవార్డు | - | Sakshi
Sakshi News home page

చిత్రకారుడు వల్లెం కృష్ణకు అంతర్జాతీయ మెరిట్‌ జ్యూరీ అవార్డు

Apr 14 2026 7:40 AM | Updated on Apr 14 2026 7:40 AM

వినుకొండ: మండలంలోని గోకనకొండ గ్రామానికి చెందిన చిత్రకారుడు వల్లెం కృష్ణకు మరో అంతర్జాతీయ స్థాయి పురస్కారం లభించింది. డాక్టర్‌ కేపీ బాబు నేతృత్వంలోని క్రియేటివ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో కృష్ణ గీసిన చిత్రానికి అంతర్జాతీయ మెరిట్‌ జ్యూరీ అవార్డు, నగదు బహుమతి అందుకున్నారు. అవార్డు పొందిన కృష్ణను పలువురు అభినందించారు.

స్కూటీ డిక్కీ నుంచి రూ.3 లక్షల మాయం

దుర్గి: దుర్గిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద ఓ స్కూటీలో ఉంచిన రూ.మూడు లక్షల నగదు చోరీకి గురైంది. దుర్గికి చెందిన వ్యాపారి మేకల బ్రహ్మం బ్యాంకు లావాదేవీల నిమిత్తం బ్యాంకులోకి వెళ్లారు. బ్యాంకులో పనిముగించుకొని బయటకు వచ్చేలోపే తన స్కూటీలో ఉంచిన రూ. 3లక్షలు అపహరణకు గురైనట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సుధీర్‌బాబు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిసర ప్రాంతాల్లోని సీసీ పుటేజిలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement