చంద్రబాబుకు మైకం వదిలించిన ‘మావిగన్‌’ | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు మైకం వదిలించిన ‘మావిగన్‌’

Apr 12 2026 3:42 AM | Updated on Apr 12 2026 3:42 AM

నరసరావుపేట: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన మావిగన్‌ దెబ్బకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మైకం వదిలి అమరావతిలోనే మావిగన్‌ ప్రాంతాలు ఉన్నాయని చెబుతున్నాడని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంటెనపాటి గాబ్రియేలు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్లాన్‌ బీలో భాగంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి మావిగన్‌ ప్రకటించారన్నారు. దీంతో టీడీపీ నాయకులు అందరూ రాజధాని పరిధిలోనే ఆ మూడు ప్రాంతాలు ఉన్నాయంటూ ఇప్పుడు కవర్‌ చేస్తున్నారన్నారు. వారి చెప్పిందే నిజమైతే గతంలో వెనుకబడిన ప్రాంతాలలో పర్యటించి వారిని రెచ్చగొడుతూ మీసాలు మెలివేసి తొడలు కొట్టిన అమరావతి యాత్రికులలో ఆ మూడు ప్రాంతాలకు చెందిన యాత్రికులు ఎందుకు లేరో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని కోరారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన గన్‌షాట్‌తో తత్వం బోధపడి దారికి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన వికేంద్రీకరణ మంత్రానికి వారి అహంకారం ఆవిరైపోయినందుకు సంతోషంగా ఉందని, అందరి వాడిగా ఉన్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొందరి వారిగా ఉన్న వారినందరినీ ఒకే ఒక్క దెబ్బతో దారికి తీసుకొచ్చాడన్నారు. మహిళలపై ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి

గంటెనపాటి గాబ్రియెల్‌

Advertisement
 
Advertisement
Advertisement