ఇంటర్వ్యూలకు 169మంది హాజరు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్వ్యూలకు 169మంది హాజరు

Apr 11 2026 8:16 AM | Updated on Apr 11 2026 8:16 AM

ఇంటర్వ్యూలకు 169మంది హాజరు నరసరావుపేట: మూడు చక్రాల స్కూటీల కోసం ఽఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విభిన్న ప్రతిభావంతులకు శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ సంజనా సింహ పర్యవేక్షణలో నిర్వహించిన శిబిరానికి సత్తెనపల్లి, పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాలకు చెందిన 169మంది హాజరయ్యారు. హాజరైన వారికి మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగసరపు సుబ్బరాయగుప్తా భోజన సదుపాయాలు కల్పించారు. శిశు గృహం సంరక్షణలో చిన్నారి నరసరావుపేట రూరల్‌: కోటప్పకొండలోని తోడు–నీడ వృద్ధాశ్రమం సమీపంలో మూడు సంవత్సరాల చిన్నారిని గుర్తించి నరసరావుపేట శిశు గృహంలో ఉంచినట్టు జిల్లా బాలల పరిరక్షణ అధికారి డి.శౌరిరాజు తెలిపారు. ఈనెల 4వ తేదీ పాపను స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో నరసరావుపేట రూరల్‌ పోలీసుల ద్వారా జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంరక్షణలోకి తీసుకున్నట్టు వివరించారు. అనంతరం చిన్నారికి ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి గుంటూరు బాలల సంక్షేమ సమితి ఎదుట వర్చువల్‌ విధానంలో హాజరుపర్చినట్టు తెలిపారు. వారి ఆదేశాల మేరకు నరసరావుపేటలోని శిశు గృహంలో ఉంచినట్టు పేర్కొన్నారు. చిన్నారికి సంబంధించిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు తగిన ఆధారాలతో జిల్లా బాలల పరిరక్షణ అధికారి డి.శౌరిరాజు(8919164537)ను సంప్రదించాలని కోరారు. ముగ్గురు అరెస్టు రెంటచింతల: క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు యువకులను రెంటచింతల పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడి చేసి యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. బస్సు ఢీకొని ఏఎన్‌యూ ఉద్యోగి మృతి

మేడికొండూరు : ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మేడికొండూరు సీఐ మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన బాలేటి మనోహర్‌ (26) ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం తన విధులు ముగించుకొని స్కూటీపై సత్తెనపల్లి వెళుతుండగా మార్గంమధ్యలో మేడికొండూరు సమీపాన ఇండియన్‌ గ్యాస్‌ గోడౌన్‌ వద్ద పిడుగురాళ్ల డిపోకి చెందిన ఆర్టీసీ బస్సును డ్రైవర్‌ అజాగ్రత్త నడుపుతూ మనోహర్‌ పయనిస్తున్న స్కూటీని ఢీ కొట్టాడు. ప్రమాదంలో మనోహర్‌ బస్సు కింద పడి సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ప్రమాదంపై మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement