వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యవర్గంలో నియామకాలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యవర్గంలో నియామకాలు

Apr 10 2026 10:09 AM | Updated on Apr 10 2026 10:09 AM

వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యవర్గంలో నియామకాలు

నరసరావుపేట: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పలువురు నాయకులను జిల్లా కార్యవర్గంలో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి (సత్తెనపల్లి)ని నియమించారు. అలాగే జిల్లా విద్యార్థి విభాగంలో ఉపాధ్యక్షుడిగా భోగిరెడ్డి అంకిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా షేక్‌ షహీద్‌, ముడేల విష్ణువర్ధనరెడ్డి (గురజాల), బి.సాయి శ్రీనివాసరెడ్డి (సత్తెనపల్లి), జిల్లా కార్యదర్శులుగా చింతారెడ్డి రాఘవరెడ్డి, నీలం ఆంజనేయులు (గురజాల), కె.సుధాకరరెడ్డి (సత్తెనపల్లి) నియమించారు. అలాగే ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా సత్తెనపల్లికి చెందిన ఎం.శ్రీనివాసులు, షేక్‌ మొహిద్దీన్‌, షేక్‌ నాగరాజునాయక్‌, జిల్లా గ్రీవెన్స్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా జి.సుసేంధ్ర. జిల్లా కార్యదర్సిగా కె.వెంకటపుల్లారెడ్డి, జిల్లా గ్రీవెన్‌సెల్‌ ఎగ్జిక్యూటీవ్‌ మెంబర్లుగా టి.శ్రీనివాసరావు, టి.సైదారావు, గ్రీవెన్స్‌ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మార్క్‌కాసిమాల, కార్యదర్శులుగా బి.శ్రీనివాసరావు, లీగల్‌సెల్‌ జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా ఎ.నాగరాజు, పి.హరిమణికంఠ నియమితులయ్యారు. జిల్లా ఇంటలెక్చ్యువల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా చింతారెడ్డి నాగిరెడ్డి (గురజాల), జిల్లా వాణిజ్య విభాగ సెక్రటరీగా వేలమూరి సైదారెడ్డి (గురజాల), జిల్లా పబ్లిసిటీ వింగ్‌ కార్యదర్సిగా తాయ వెంకటేశ్వర్లు (గురజాల), జిల్లా వైఎస్సార్‌టీయూసీ సెక్రటరీగా షేక్‌ నాగూల్‌మీరా (గురజాల) నియమితులయ్యారు.

మాచర్ల నియోజకవర్గ బాధ్యులుగా..

అలాగే మాచర్ల నియోజకవర్గ గ్రీవెన్‌సెల్‌ అధ్యక్షుడిగా శీలం మల్లారెడ్డి, నియోజకవర్గ పంచాయతీరాజ్‌ వింగ్‌ అధ్యక్షుడిగా చల్లా మట్టారెడ్డి నియమితులయ్యారు.

పిడుగురాళ్ల మండల కార్యవర్గం..

గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలం రైతు విభాగం అధ్యక్షుడిగా తెలగనేని సాంబశివరావు, సోషల్‌ మీడియా అధ్యక్షుడిగా అంచూరి వంశీరెడ్డి, పబ్లిసిటీ వింగ్‌ అధ్యక్షుడిగా దేవిశెట్టి వీరాంజనేయులు, వైఎస్సార్‌టీయూసీ అధ్యక్షులుగా తాళ్లపోగు సాల్మన్‌ నియమితులయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement