మూగజీవాలపై పిడుగుపాటు | - | Sakshi
Sakshi News home page

మూగజీవాలపై పిడుగుపాటు

Apr 10 2026 10:09 AM | Updated on Apr 10 2026 10:09 AM

పెదకూరపాడు: పెదకూరపాడు మండల వ్యాప్తంగా గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని గారపాడు గ్రామంలో గ్రామానికి చెందిన మొక్కల కృష్ణ ప్రసాద్‌, నల్గొండ మల్లికార్జునలకు చెందిన 14 మేకలు పిడుగుపాటు గురై మృత్యువాత పడ్డాయి. లగడపాడు గ్రామంలో పల్లం యేసుబాబుకు చెందిన పాడి గేదె ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తూ ఉండటంతో ఇంటి వద్ద ఉన్న చింత చెట్టుకు గేదెను కట్టేసి ఇంట్లో కి వెళ్ళగా ఒకసారిగా భారీ శబ్ధంతో పిడుగు పడటంతో పాడి గెదె అక్కడికక్కడే మృతి చెందింది. పెదకూరపాడు లోని రైల్వే స్టేషన్‌ సమీపంలో తాటి చెట్లపై పిడుగులు పడటంతో మంటలు చెలరేగి విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. విద్యుత్‌ లైన్‌లు దిగబడటంతో ఐదు గంటలు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కల్లాల్లో మిర్చి పంటను కాపాడుకునేందుకు రైతులు పట్టలు కప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement