రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

Apr 10 2026 10:09 AM | Updated on Apr 10 2026 10:09 AM

శావల్యాపురం: గుంటూరు–కర్నూలు జాతీయ రహదారి మార్గంలో మండలంలోని కనమర్లపూడి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. ఎస్‌ఐ మోర్ల వెంకటేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకు చెందిన నంబూరి రవీంద్ర (16) ఉదయం టిఫిన్‌ తీసుకొని రావటానికి తన తాతాయ్య నంబూరు పేరయ్య చెందిన మోపెడ్‌పై దుకాణానికి వస్తుండగా,అదే సమయంలో వినుకొండ వైపు నుంచి నరసరావుపేటకు వెళుతున్న మినీ ట్రక్కు వాహనం డ్రైవరు చలంచర్ల వెంకటేశ్వర్లు అతివేగంతో వచ్చి ఎదురుగా వస్తున్న మోపెడ్‌ను ఢీకొట్టాడు. తలకు బలమైన గాయాలు కావటంతో సంఘటన స్థలంలో బాలుడు రవీంద్ర మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్లో నంబూరి రవీంద్ర పదో తరగతి పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. నంబూరి డేవిడ్‌కు ఇద్దరు సంతానం కాగా మొదట కుమారుడు అకాలంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. వినుకొండ ప్రభుత్వ వైద్యశాల్లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేశామని ఎస్సై మోర్ల వెంకటేష్‌ బాబు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement