లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): బీజేపీ పాలనలో న్యాయస్థానాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ పేర్కొన్నారు. గుంటూరులో ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు తొందరపాటుతో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించారని తెలిపారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు దళితుల్ని ముఖ్యమంత్రిని చేయాలని సీపీఎం అగ్రనాయకులు హరికిషన్ సింగ్ సూర్జిత్ కాంగ్రెస్ హై కమాండ్‌కు గట్టిగా సిఫార్సు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అంశం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం జరుగుతోందన్నారు. రాజ్యాంగ సవరణ చేసి, రిజర్వేషన్లు కల్పిస్తారన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ రాజకీయ ప్రేరేపిత జడ్జిమెంట్ అని పేర్కొన్నారు. దళితులను బలహీనం చేయాలనే కుట్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అందులో భాగంగానే ఏబీసీడీ వర్గీకరణ తీర్పు అని పేర్కొన్నారు. ఇప్పుడు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు వంటి తీర్పులు వచ్చాయన్నారు. 2029లో ఎస్సీలు దేశ, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నారన్నారు. విలేకరులు సమావేశంలో ఎస్సీ నాయకుడు అన్నవరపు కిషోర్ పాల్గొన్నారు.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్


