ప్రతి విద్యార్థి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరచాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి విద్యార్థి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరచాలి

Nov 26 2025 6:53 AM | Updated on Nov 26 2025 6:53 AM

ప్రతి

ప్రతి విద్యార్థి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరచాలి

ప్రతి విద్యార్థి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరచాలి కంది పంటకు పురుగు ఆశించే అవకాశం ప్రమాదకరంగా బోరు సాతులూరు–నరసరావుపేట మధ్య రైల్వే గేటు మూసివేత సాగర్‌ నీటిమట్టం వివరాలు

తాడేపల్లిరూరల్‌: ప్రతి విద్యార్థి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరచాలని ఆర్‌జేడీ పద్మ అన్నారు. ఇంటర్మీడియెట్‌ పరీక్షలలో విద్యార్థు ల ఉత్తీర్ణత శాతాన్ని పెంచటానికి ఇంటర్‌ బోర్డు ప్రవేశపెట్టిన సంకల్ప్‌–2026 అమలు పర్యవేక్షించటానికి మంగళవారంపెనుమాక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆర్‌జేడీ ఆకస్మికంగా సందర్శించారు. ప్రతి తరగతిని పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తంచేశారు. ఎస్‌ఆర్‌కేవీఎం పథకం ద్వారా విద్యార్థులకు ఉచిత నీట్‌, జేఈఈ మెటీరియల్‌ అందజేశారు. అనంతరం అధ్యాపకు లతో సమావేశమై ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సా ధించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.శ్రీనివాసరావు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఆర్‌జేడీ పద్మను శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు.

అచ్చంపేట: తాడువాయిలో కంది పంటను క్రోసూరు వ్యవసాయ సహాయ సంచాలకులు పి.మస్తానమ్మ, ఏవో పి.వెంకటేశ్వర్లుతో కలసి మంగళవారం పరిశీలించారు. కంది పంటను ఆకుచుట్టు పురుగు, పూత పురుగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉందని, ఈ పురుగు లేత ఆకులను, పూతను కలిపి గూడుగా చేసుకుని పంటకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయన్నారు. నివారణకు క్లోరిపైరిఫోస్‌, నోవల్యూరోన్‌, తయోదికార్బ్‌ నీటితో కలిపి మొక్క పూర్తిగా తడిసే వరకు పిచికారి చేయాలన్నారు. పురుగు ఉధృతి బాగా ఉన్నప్పుడు లామిడా సైహలో త్రిన్‌ మందును నీటితో కలిపి పిచికారి చేసుకోవాలన్నారు.

గుంటూరుఎడ్యుకేషన్‌: గుంటూరులోని అమరా వతి రోడ్డు భారత్‌పేట ఐదవ లైనులో వినియోగంలో ఉన్న బోరింగ్‌ పంపు కార్పొరేషన్‌ సిబ్బంది నిర్లక్ష్యంతో మూలన పడింది. స్థానికుల నీటి అవసరాలకు ఉపయోగకరంగా ఉన్న చేతిపంపు ఆర్నెల్ల క్రితం మరమ్మతుకు గురికావడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు వచ్చి తీసుకెళ్లిన సిబ్బంది తిరిగి బిగించడం మరిచారు. అప్పటి నుంచి బోరును ఓపెన్‌గా అలాగే వదిలివేయడంతో చిన్నారులు ఎవరైనా అటువైపు వెళితే ప్రమాదం బారిన పడే పరిస్థితులు ఉన్నాయి. అధికారులు స్పందించి తక్షణమే చేతి పంపును బిగించాలని స్థానికులు కోరుతున్నారు.

నరసరావుపేట: సాతులూరు–నరసరావుపేట రైల్వే స్టేషన్ల మార్గంలో లెవల్‌ క్రాసింగ్‌ గేట్‌ వద్ద ఈనెల 26వ తేదీ నుంచి 28 వరకు అత్యవసరంగా పట్టాలు మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు గుంటూరు రైల్వే డివిజన్‌ పీఆర్‌వో వినయ్‌కాంత్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీని కారణంగా ఆ మూడు రోజులు రైల్వేగేటు మూసివేయటం జరుగుతుందన్నారు. ప్రయాణికులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కోరారు.

విజయపురిసౌత్‌: నాగార్జుసాగర్‌ జలాశయ నీటిమట్టం మంగళవారం 582.80 అడుగులకు చేరింది. ఇది 290.5140 టీఎంసీలకు సమానం. సాగర్‌ జలాశయం నుంచి కుడికాలువకు 9,500, ఎడమకాలువకు 4,160, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి 12,586, ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్‌ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 28,046 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి వచ్చే నీటిచేరిక పూర్తిగా నిలిచిపోయింది.

ప్రతి విద్యార్థి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరచాలి 
1
1/3

ప్రతి విద్యార్థి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరచాలి

ప్రతి విద్యార్థి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరచాలి 
2
2/3

ప్రతి విద్యార్థి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరచాలి

ప్రతి విద్యార్థి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరచాలి 
3
3/3

ప్రతి విద్యార్థి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరచాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement