జాతీయ సైక్లింగ్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
నరసరావుపేట రూరల్: జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికై నట్టు జొన్నలగడ్డ జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు బి.మల్లికార్జునరావు తెలిపారు. 69వ రాష్ట్ర స్థాయి స్కూల్‌గేమ్స్ పోటీలు ఎన్‌టీఆర్ జిల్లా నున్నా జెడ్పీ హైస్కూల్ నిర్వహించారు. జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి జాతీయ జట్టుకు ఎంపికయ్యారని హెచ్‌ఎం పేర్కొన్నారు. ట్రాక్ విభాగంలో సీహెచ్ విజయలక్ష్మి, ఎన్.పరమాత్మలు ప్రథమ స్థానం, రోడ్ విభాగంలో ఎస్‌కే నబీర్ (అండర్–17), వై.తేజస్విని (అండర్–14), ఎన్.సింధు (అండర్–14)లు ప్రథమస్ధానం, ఎన్.బింధుశ్రీ (అండర్–17), జి.నరేంద్ర (అండర్–14), ఎస్‌కే ఆమన్ (అండర్–14) ద్వితీయ స్థానం, జి.మణికంఠ (అండర్–17), ఎ.లావణ్య (అండర్–14)లు తృతీయ స్థానాలు సాధించినట్టు పేర్కొన్నారు. వీరిని వ్యాయమ ఉపాధ్యాయుడు ఐ.సునీల్, ఉపాధ్యాయులు అభినందించారు.


