ప్రతి కార్యకర్తకూ వైఎస్సార్ సీపీ అండ
దుర్గి: అక్రమ అరెస్టులు, కేసులు తనపై మోపినా ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం మండల పరిధిలోని కంచరగుంట, మంగాపురం తండా గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన మాజీ సర్పంచ్ ఆలేటి వెంకటేశ్వర్లు, యాక్సిడెంట్‌కు గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న బాణావత్ బాలునాయక్‌లను పరామర్శించారు. మంగాపురం తండాలో ఇటీవల అక్రమ కేసులు బనాయించి పోలీసులతో దెబ్బలుతిన్న పలువురిని పరామర్శించారు. ఈ సందర్భంగా పీఆర్కే మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రతి కార్యకర్తను, నాయకులను, అభిమానులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని అభయమిచ్చారు. అధికారముందని, అక్రమంగా, అన్యాయంగా వేధింపులకు గురిచేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాబోవు రోజుల్లో ప్రజా ఉద్యమాలను చేపట్టి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. సంవత్సరంన్నర కాలంలోనే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని, దీనికి తాజా ఉదాహరణే మాజీ సీఎం జగన్ పర్యటనకు తరలివస్తున్న ప్రజానీకమేనని వివరించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఉన్నం పెద్దబ్బాయ్, గొట్టం బ్రహ్మారెడ్డి, పార్టీ నాయకులు పాశం కోటిరెడ్డి, బూడిద సైదులు, తోట మూర్తి, మాదాసు వాసు, అరిగెల కొండలు, కలవల వీరగోవిందు, మాదాసు భిక్షమయ్య, మోతీలాల్ నాయక్, కోటా రాజు, బొంతా కృష్ణ, మాదాసు హనుమంతరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
స్వామీ.. మరలా జగనన్న పరిపాలనే రావాలి
2024 ఎన్నికల ప్రచారం తరువాత మొదటి సారిగా మండలంలోని మంగాపురం తండాకి చేరుకున్న పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూసిన మంగాబాయి అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఆయన్ను భావోద్వేగంతో హత్తుకొని కన్నీటి పర్యంతమైంది. సోమవారం పర్యటనలో భాగంగా పీఆర్కే మంగాపురంతండాకు చేరుకున్నారు. గిరిజనులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి మాల ధరించిన పీఆర్కేను ద్దేశించి వృద్ధురాలు మాట్లాడుతూ ‘‘స్వామీ.. జగనన్న పాలన ఎప్పుడు వస్తుందయ్యా’’ అంటూ కన్నీటి పర్యంతమైంది. తమ బాగోగులు చూసే నాథుడే కరువయ్యారని పేర్కొంది.
పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
ప్రతి కార్యకర్తకూ వైఎస్సార్ సీపీ అండ


