పీఆర్సీని వెంటనే అమలు చేయాలి:ఎస్టీయూ
వెల్దుర్తి: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకిచ్చిన హామీ మేరకు పీఆర్సీని వెంటనే అమలు చేయాలని ఎస్టీయూ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఎల్.వి. రామిరెడ్డి కోరారు. సోమవారం వెల్దుర్తిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ అర్హతనిచ్చి, మినహాయింపునివ్వాలని, పెండింగ్‌లో ఉన్న కామన్ సర్వీసు రూల్స్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. బోధనేతర పనులతో ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారన్నారు. అధికారులు యాప్‌లు త్వరగా చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, అలా చేస్తే ఉద్యమానికి పిలుపునివ్వాల్సి వస్తుందని పేర్కొన్నారు. మండలంలోని నూతన ఉపాధ్యాయులకు అపరాజిత ఆగ్రోఫాం ద్వారా లంచ్ బ్యాగ్‌లు, సర్వీసు రిజిస్టర్లు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీయూ మండల అధ్యక్షుడు హరినాయక్, కార్యదర్శి తాటి రాజా, మాచర్ల రాంబాబు, మాచర్ల అనిల్, కృష్ణ, జిల్లా నాయకులు గురవయ్య, రాజశేఖర్, ఏసురత్నం, జాన్, మంగ్లానాయక్, అమలబాబు, సంస్థ మేనేజర్ శేషుబాబు పాల్గొన్నారు.


