ద్రోణాదుల యువకుడి అరుదైన ఘనత
మార్టూరు: గత దశాబ్దకాలంగా వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు సాధించిన మండలంలోని ద్రోణాదుల గ్రామానికి చెందిన పెంట్యాల ధర్మతేజ మరో అరుదైన ఘనత సాధించారు. అమెరికాకు చెందిన అట్లాంటా యూనివర్సిటీ నుంచి ధర్మ తేజ ఈనెల 21వ తేదీ డాక్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా ధర్మతేజ విలేకరులతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ వ్యాపార ధోరణులు, వ్యాపార వ్యూహాలు, సృజనాత్మక నాయకత్వాన్ని సమ్మేళనం చేస్తూ తాను సమర్పించిన వ్యాసాలకుగాను అడ్మినిస్ట్రేషన్ పట్టా అందుకున్నట్లు తెలిపారు. అట్లాంటా కాలేజ్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆన్‌లైన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తనకు ప్రదానం చేసినట్లు వివరించారు.
డాక్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో
పట్టా సాధించిన ధర్మతేజ


