సీనియర్స్ విజేత హుజూర్‌నగర్ ఎడ్ల జత
కారెంపూడి: పల్నాటి ఉత్సవాల సందర్భంగా కారెంపూడిలో జరుగుతున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలలో భాగంగా శుక్రవారం సీనియర్స్ విభాగంలో పోటీలు రసవత్తరంగా జరిగాయి. పోటీలను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. హుజూర్‌నగర్‌కు చెందిన సుంకే సురేంద్రరెడ్డి ఎడ్ల జత బండను 2,330 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతిని కై వసం చేసుకుంది. ద్వితీయ బహుమతిని బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకు చెందిన అత్తోట శిరీషాచౌదరి, శివకృష్ణ చౌదరి కంబైన్డ్ జత, తృతీయ బహుమతిని విజయవాడకు చెందిన పొందుగల ఈశ్వర్ ఎడ్ల జత, నాలుగవ బహుమతిని నంద్యాల జిల్లా గోస్పాడుకు చెందిన గోటికా హేత్విక్‌రెడ్డి, దినేష్‌రెడ్డి కంబైన్డ్ జత, ఐదో బహుమతిని బాపట్ల జిల్లా బల్లికురవకు చెందిన పావులూరి వీరస్వామిచౌదరి ఎడ్ల జత, ఆరవ బహుమతిని ప్రకాశం జిల్లా బేస్తవారిపేటకు చెందిన లక్కు నాగశివశంకర్ ఎడ్ల జత కై వసం చేసుకున్నాయి. బహుమతి దాతలు సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ చెల్లెలు నాగలక్ష్మి, పంగులూరి పుల్లయ్య, బ్రాంది షాష్స్ అసోషియేషన్, బొమ్మిన శేషగిరిరావు అండ్ సన్స్, శ్రీకృష్ణ కోల్డ్ స్టోరేజి, బాలాజీ హీరో షోరూమ్, కల్లుట్ల రమేష్, మాడిశెట్టి నరసింహారావు, మిరియాల వెంకటేశ్వర్లులు ప్రదానం చేశారు. కమిటీ సభ్యులు బొమ్మిన శ్రీనివాసరావు, బొమ్మిన శేషగిరిరావు, నాగారపు రాముడు, పలిశెట్టి హనుమంతరావు, పలిశెట్టి శ్రీను, చింతపల్లి రామ్మూర్తి, కార్యనిర్వాహక సభ్యులు కర్నా సైదారావు, పలిశెట్టి కోటేశ్వరరావు, సంగినేడి బాలకృస్ణ, తోట శ్రీను. పలిశెట్టి రాఘవ, తోట అబ్బాయి, పలిశెట్టి కొండ, జక్కా నరసింహారావు, జక్కా వీరయ్య పురంశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పోటీల నిర్వహణలో పాల్గొన్నారు.


