తుపాను బాధిత కుటుంబాలకు సాల్వేషన్ ఆర్మీ సాయం
కొల్లూరు: మోంథా తుపాను కారణంగా నిరాశ్రయులైన కుటుంబాలకు అంతర్జాతీయ రక్షణ (సాల్వేషన్ ఆర్మీ) సైన్యం ఎమర్జెన్సీ డిజాస్టర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమం చేపట్టారు. మండలంలోని ఈపూరులంక, మొసలిపాడు గ్రామాలలోని పలు కుటుంబాలకు నిత్యావసర సరుకులను బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సాల్వేషన్ ఆర్మీ రాష్ట్రీయ నాయకులు కమిషనర్ దాసరి దానియేల్ రాజు, ఈపూరులంక సర్పంచి మేకతోటి శ్రీకాంత్, సాల్వేషన్ ఆర్మీ ప్రతినిధులు లెప్ట్ కల్నల్ గేరా థామస్, మేజర్ ప్రభాత్‌కుమార్, కెప్టెన్ రమేష జీవన్‌రాయ్, మేజర్ రవి మోసెస్, మేకతోటి శరత్, ప్రవీణ్ పాల్గొన్నారు.


