వాసవి నిత్యాన్నదాన సత్రం అధ్యక్షుడిగా ‘తడవర్తి’
అమరావతి: అమరావతి వాసవి వాసప్రస్థాశ్రమ నిత్యాన్నదాన సత్రం అధ్యక్షుడిగా గుంటూరుకు చెందిన తడవర్తి రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం నిత్యాన్నదాన సత్రంలో జరిగిన కార్యక్రమంలో తడవర్తి రాంబాబుతో పాటుగా ఉపాధ్యక్షులుగా ఎల్‌ఎస్‌ఆర్ ఆజనేయులు, చిత్రిల గురుపెద్దన్న, భవనాశి యల్లారావు, కాంశెట్టి లోకేష్ గుప్తా, టి.చంద్రభాస్కరరావు ప్రధానకార్యదర్శిగా ఎల్.మోహన భాస్కరరావు, సాంబశివరావు, పి. ఎస్.నరేంద్రకుమార్, ఎంఎస్‌వీ గోపాలకృష్ణ శ్రేష్టిలు కార్యదర్శులుగా, కోశాధికారిగా వి. నాగేశ్వరరావులు ఎన్నికయ్యారు. శ్రీశైలం, కాణిపాకం అన్నదాన సత్రాల చైర్మన్ గోళ్ళ సుబ్రరత్నం వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈకార్యక్రమంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, క్రేన్ ఇండస్ట్రీస్ అధినేత జీవీఎస్‌ఎల్ కాంతారావు, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్ని రామకోటేశ్వరరావు, అన్నవరం ఆర్యవైశ్య సత్రం అధ్యక్షుడు పేరూరి గాంధీలతో పాటు పలువురు సత్రం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


