దాచేపల్లి: ముదిరాజులు ఐక్యమత్యంతో ఉండాలని ముదిరాజు సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు గుర్రం శ్రీనివాసరావు అన్నారు. పల్నాడు ముదిరాజు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నారాయణపురంలోని మందపాటి నాగిరెడ్డి కల్యాణ మండపంలో 7వ కార్తీకమాస వన సమారాధన జరిగింది. ముదిరాజుల కులదైవానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముదిరాజులు ఉన్నతమైన చదువులు చదువుకోవాలని, అన్ని రంగాల్లో రాణించాలని చెప్పారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆటల పోటీలు నిర్వహించి మహిళలకు బహుమతులు అందజేశారు. సంఘం మండలశాఖ అధ్యక్షుడు యల్లబోయిన రామకోటయ్య, ఉపాధ్యక్షుడు బొడ్డు పెదనరసింహారావు, నాయకులు నార్ల కాశయ్య, రాగి సైదులు, బొడ్డు నరసింహరావు, గంగయ్య, నరసింహారావు, నీలయ్య, సైదులు, అంజి, సాయి, గుడూరి నాని, తాతనబోయిన మల్లిఖార్జున్ పాల్గొన్నారు.


