
రోడ్లపై అడ్డంగా ముళ్ల కంపలు
స్థానికుల రాకపోకలు అడ్డుకున్న టీడీపీ నేత రెంటచింతల మండలం తుమృకోటలో ఘటన చర్యలకు అధికారుల తాత్సారం
రెంటచింతల: మండలంలోని తుమృకోట గ్రామంలో నున్న రెండు రహదారులపై తెలుగుదేశం పార్టీ నాయకుడు ముళ్ల కంపవేసి రాకపోకలను అడ్డుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని జంగాలవారి వీధిలోని హనుమాన్ ఆలయం సమీపంలో ఆదివారం టీడీపీకి చెందిన ఓ వ్యక్తి నా స్థలం.. నా ఇష్టం అంటూ గ్రామస్తులు నడిచే రెండు రహదారులపై ముళ్లకంప వేసి అడ్డుకున్నాడు. దీంతో ఆ కాలనీకి చెందిన కొందరు గ్రామ వీఆర్‌ఓ నరసింహ, గ్రామ సర్వేయర్ శివేంద్రకు సమాచారం ఇవ్వగా.. వారు ఇద్దరూ వెళ్లి సర్వే చేసి.. ముళ్ల కంపలు తీయించకపోగా.. తాము కార్యదర్శికి చెబుతామని మీరు తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పినట్లు తెలిపారు. ఈ రహదారి స్థలం 1988లో అడ్డుకున్న వ్యక్తి తాత వద్ద నుంచి ఆ ప్రాంతానికి చెందిన వారు రూ.4 వేలకు కొనుగోలుచేసి రహదారి ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు. విషయాన్ని ఆ వీధికి చెందిన కొందరు రెంటచింతల ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున దృష్టికి తీసుకువెళ్లగా ఇరువర్గాలు ఆ స్థలానికి సంబంధించి పేపర్లు తీసుకువస్తే మాట్లాడతానని, సమస్యను రెవెన్యూ శాఖవారు పరిష్కరిస్తారని తెలిపారన్నారు. దీనిపై గ్రామస్తులు ఎంపీడీఓ సీహెచ్ శ్రీనివాసరావును సంప్రదించగా.. గురువారం తహసీల్దార్, ఎస్‌ఐలతో కలిసి వెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారని తెలిపారన్నారు.

రోడ్లపై అడ్డంగా ముళ్ల కంపలు