న్యాయం మృగ్యం | - | Sakshi
Sakshi News home page

న్యాయం మృగ్యం

Jul 17 2025 3:26 AM | Updated on Jul 17 2025 3:26 AM

న్యాయ

న్యాయం మృగ్యం

పల్నాడు
వినుకొండలో రషీద్‌ హత్యకు నేటితో ఏడాది
రషీద్‌ కుటుంబానికి వైఎస్‌ జగన్‌ అండ

గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025

సాక్షి, నరసరావుపేట: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వినుకొండకు చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త రషీద్‌ హత్య జరిగి నేటికి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. గతేడాది జూలై 17వ తేదీ రాత్రి తెలుగుదేశం పార్టీ గుండాల చేతిలో రషీద్‌ బలయ్యాడు. కేసులో ఏ1 నిందితుడు షేక్‌ జిలానీ నడిరోడ్డుపై ప్రజలంతా చూస్తుండగానే అత్యంత పాశవికంగా రషీద్‌ను నరికి చంపేశాడు. హత్య చేసింది టీడీపీ కార్యకర్తలు కావడంతో కూటమి ప్రభుత్వం కేసును నీరుగార్చేందుకు యత్నిస్తోందని మృతుడు రషీద్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి రక్తసంబంధీకులు ఇచ్చిన ఫిర్యాదులోని నిందితుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చకుండా నామమాత్రంగా కొందరిని అరెస్టు చేసి చేతులు దులుపుకొన్నారన్న విమర్శలు బాధిత కుటుంబం నుంచి వినిపిస్తున్నాయి.

సూత్రధారులను వదిలేశారు

హత్య జరిగిన రోజే రషీద్‌ సోదరుడు ఖాదర్‌బాషా ఇచ్చిన ఫిర్యాదులో రషీద్‌ మరణానికి కారణంగా పేర్కొంటూ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, వినుకొండ మున్సిపాలిటీకి చెందిన కీలక టీడీపీ నేతలు షమీమ్‌ఖాన్‌, అయూబ్‌ఖాన్‌, హంతకుడు జిలానీ స్నేహితులైన కొందరు టీడీపీ రౌడీల పేర్లు ప్రస్తావించారు. అయితే పోలీసులు కేవలం హత్యలో పాల్గొన్న కొందరు టీడీపీ గుండాల పేర్లు మాత్రమే పొందుపరచి, హత్యకు కుట్రపన్నిన ప్రాజాప్రతినిధులు, పట్టణ టీడీపీ ముఖ్యనేతల పేర్లు తొలగించారు. దీనిపై తొలిరోజు నుంచి రషీద్‌ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షమీమ్‌ఖాన్‌, అయూబ్‌ఖాన్‌లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలన్న డిమాండ్‌ను పోలీసులు పట్టించుకోలేదు. రషీద్‌ హత్యకు కథ, స్క్రీన్‌ప్లే మొత్తం షమీమ్‌, అయూబ్‌ఖాన్‌లే రచించారనదే వారి వాదన. హత్యకు కుట్ర పన్నిన వారిని పక్కకు తప్పించి.. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగిన హత్యగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు.

మరో నలుగురి పేర్లు తొలగింపు

రషీద్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు జిలానీ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. మిగిలిన వారు బెయిల్‌పై బయటకు వచ్చి సాక్షులను బెదిరిస్తున్నారని రషీద్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల వినుకొండ టౌన్‌ పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న నిందితులు ఏ1 జిలానీ సోదరుడు జిమ్‌ జానీ, షేక్‌ షఫీ, ఇమ్రాన్‌, పొట్లపాడు సాయిబాల పేర్లు తొలగించారు. అధికారపార్టీకి చెందిన వీరిని కేసులో నుంచి బయటపడేసేందుకు టీడీపీకి అనుకూలంగా ఉన్న నలుగురు సాక్షులను పోలీసులు చేర్చి, వారి వాంగ్మూలం ఆధారంగా ఈ నలుగురు నిందితుల పేర్లు తొలగించారని రషీద్‌ కుటుంబ సభ్యులు, న్యాయవాదులు వాపోతున్నారు. దీనిపై రషీద్‌ కుటుంబ సభ్యులు కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు.

7

న్యూస్‌రీల్‌

నడిరోడ్డుపై విచక్షణారహితంగా నరికిన టీడీపీ కార్యకర్త జిలానీ కూటమి నేతల ఒత్తిడితో ఇద్దరు టీడీపీ ముఖ్య నేతల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చని పోలీసులు ఛార్జిషీట్‌లో మరో నలుగురు టీడీపీ కార్యకర్తల పేర్లు తొలగింపు కేసులో ఏ1 జిలానీ తప్ప అందరూ బెయిల్‌పై బయట తిరుగుతున్న వైనం రషీద్‌ కుటుంబ సభ్యులు, సాక్షులను బెదిరించి కేసు రాజీకి ఒత్తిడి రషీద్‌ సోదరుడి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం తొలగింపు ,. తప్పుడు కేసు నమోదు

సాక్షులకు వేధింపులు

రషీద్‌ కేసులో సాక్షులను బెదిరించి కేసును నీరుగార్చేలా వినుకొండ టౌన్‌ పోలీసులు వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా వినుకొండ పట్టణ పరిధిలో 2022 జూలై 10వ తేదీన జరిగిన ఓ గొడవకు సంబంధించిన పాత కేసులో కొత్త సెక్షన్లు చేర్చి వైఎస్సార్‌ సీపీ నేతలు, రషీద్‌ సోదరుడు ఖాదర్‌లను ఈ ఏడాది జనవరిలో రిమాండ్‌కు పంపారు. రషీద్‌ మర్డర్‌ కేసు నుంచి బయటపడటంతో పాటు వైఎస్సార్‌ సీపీకి అండగా ఉన్న మైనార్టీలను భయపెట్టాలన్న ఉద్దేశంతో కూటమి నేతల అండదండలతో రషీద్‌ హత్య కేసు నిందితులు కొత్త ప్లాన్‌ అమలు చేశారు. ఇందుకు పోలీసుల సహాయం లభించడంతో అక్రమ సెక్షన్లు బనాయింపు, కేసులో సంబంధం లేని వారిని చేర్చడం చకచకా జరిగిపోయాయి. ఏకంగా 30 మందిని జైలుపాలు చేశారు. ఎలాగైనా రషీద్‌ కేసులో రాజీ పడాలన్న ఉద్దేశంతోనే అక్రమ కేసులు, బెదిరింపులకు పాల్పడుతున్నట్టు రషీద్‌ కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

బెదిరిస్తున్నారు..

టీడీపీ రౌడీమూకలు నా బిడ్డ రషీద్‌ను నడిరోడ్డుపై పాశవికంగా నరికి చంపేశారు. రషీద్‌ కేసులో అసలు దోషులను కేసులో లేకుండా తప్పించారు. నా కొడుకు మృతికి కారణమైన వారికి శిక్షపడుతుందని నమ్మకం లేకపోగా మరో కొడుకు ఖాదర్‌ను కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ఇబ్బందికి గురిచేస్తోంది. విద్యుత్‌ శాఖలో దశాబ్దానికి పైగా పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం నుంచి తొలగించారు. అది చాలదన్నట్టు అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపారు. కేసు రాజీ చేసుకోవాలని నా కొడుకు, ఇతర సాక్షులను బెదిరిస్తున్నారు.

– బడేబీ, రషీద్‌ తల్లి, వినుకొండ

రషీద్‌ హంతకులకు శిక్ష పడాల్సిందే ..

రషీద్‌ హత్య కేసు నిందితులకు శిక్షపడేలా చేయడానికి వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ తరఫున కృషి చేస్తున్నాం. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. నిందితులకు అండగా నిలుస్తున్నారన్న భావన కనిపిస్తోంది. నలుగురిని సరైన ఆధారాలు లేవన్న సాకుతో ఛార్జిషీట్‌ నుంచి తొలగించారు. దీనిపై కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నాం.

– ఎంఎన్‌ ప్రసాద్‌, సీనియర్‌ అడ్వకేట్‌, వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి

టీడీపీ గూండాల చేతిలో దారుణంగా హత్యకు గురైన వైఎస్సార్‌ సీపీ కార్యకర్త రషీద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతేడాది జూలై 19వ తేదీన వినుకొండకు వచ్చారు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు మనోధైర్యం చెప్పారు. రషీద్‌ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని దేశ రాజధాని వేదికగా వైఎస్‌ జగన్‌ నిలదీశారు. ఆ కుటుంబానికి న్యాయం చేకూర్చేవిధంగా వైఎస్సార్‌ సీపీ లీగల్‌సెల్‌ న్యాయవాదులను పంపి పోరాటం చేయిస్తున్నారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆ కుటుంబానికి అండగా నిలిచి న్యాయపోరాటానికి అవసరమైన నైతిక మద్దతును అందిస్తున్నారు.

న్యాయం మృగ్యం1
1/8

న్యాయం మృగ్యం

న్యాయం మృగ్యం2
2/8

న్యాయం మృగ్యం

న్యాయం మృగ్యం3
3/8

న్యాయం మృగ్యం

న్యాయం మృగ్యం4
4/8

న్యాయం మృగ్యం

న్యాయం మృగ్యం5
5/8

న్యాయం మృగ్యం

న్యాయం మృగ్యం6
6/8

న్యాయం మృగ్యం

న్యాయం మృగ్యం7
7/8

న్యాయం మృగ్యం

న్యాయం మృగ్యం8
8/8

న్యాయం మృగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement