
పార్టీకి పెరుగుతున్న ఆదరణ
మోదుగుల మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పర్యటనలు మొదలుపెట్టే వరకు ఒక మాజీ ఎంపీగా పోలీసు అధికారులకు ఫోన్ చేసినా తనను లెక్క చేయలేదని గుర్తుచేశారు. అయితే పొదిలి, రెంటపాళ్ల పర్యటనలతో మార్పు వచ్చిందన్నారు. ఇప్పుడు కుర్చీలు వేసి పనిచేసి పెడుతున్నారని చెప్పారు. చంద్రబాబు చెప్పినట్టు డబ్బులు ఇవ్వలేదనే విషయం ప్రతి మహిళకు తెలియజేయాలన్నారు. కూటమి నాయకులు ఎక్కడా తిరగలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. చంద్రబాబు మోసాలను వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వివరించాలని సూచించారు. డాక్టర్ గోపిరెడ్డికి కార్యకర్తలు అండగా నిలబడాలని సూచించారు.