
శరణు శాకంబరి
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజైన బుధవారం పెద్ద ఎత్తున భక్తులు ఇంద్ర కీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని శాకంబరిగా దర్శించుకున్నారు. మరో వైపున ఆషాఢ మాసోత్సవాలు కొనసాగుతుండగా.. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల నుంచి పలు భక్త బృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పించాయి. సుమారు 50కిపైగా భక్త బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయి. శాకంబరి ఉత్సవాలకు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రైతుల నుంచి సుమారు 25 టన్నులకుపైగా కూరగాయలు, ఆకుకూరలను సేకరించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. – ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)