
గంజాయి హాట్‌స్పాట్‌లను
తనిఖీ చేయండి
నరసరావుపేట: జిల్లా వ్యాప్తంగా గుర్తించిన గంజాయి హాట్‌స్పాట్‌లను పోలీసులు పూర్తిగా తనిఖీచేసి పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావుతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్స్ కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఎన్‌డీపీఎస్ కేసులు, ఎన్‌డీపీఎస్ చట్టం కింద గతంలో నమోదైన కేసులు, కొత్త కేసులపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల్లో ఉన్న అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. డ్రగ్ అబ్యూస్ అవగాహన, నివారణను ప్రోత్సహించేందుకు పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు అన్ని విద్యాసంస్థల్లో ఈగిల్ క్లబ్‌లను ఏర్పాటుచేసి, క్లబ్ సభ్యుల వివరాలతో డేటాబేస్ నిర్వహించాలని డీఈఓను ఆదేశించారు. గురువారం అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినం సందర్భంగా జిల్లావ్యాప్తంగా వాకథాన్ నిర్వహణకు సూచనలు జారీ చేశారు. అదనపు ఎస్పీ జేవీ సంతోష్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, డీఈఓ చంద్రకళ, ఈగిల్ అధికారి, సామాజిక సంక్షేమ అధికారి శామ్యూల్ రాజీవ్, డీఆర్‌ఓ ఏకా మురళి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.రవి, స్పెషల్ బ్రాంచ్ ఏఎస్పీ, మాతా జ్ఞానమ్మ డీ–అడిక్షన్ సెంటర్ (ఎన్జీఓ) ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్స్ కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించిన కలెక్టర్