నూజెండ్ల: గేట్–2025 పరీక్ష ఫలితాల్లో ఘంటా హేమంత్ 25వ ర్యాంకు సాధించాడు. ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. అతడు ప్రస్తుతం చైన్నె ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తల్లిదండ్రులైన ఘంటా నాగేశ్వరరావు, సుజాత దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఇటీవల జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మైక్రోసాఫ్ట్‌కు ఎంపికయ్యాడు. గేట్ ర్యాంకు ద్వారా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో హేమంత్ పీజీ చేయటానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు పొందుతూ చదువుకునే అవకాశాలు ఉంటాయని నాగేశ్వరరావు తెలిపారు.