
పెదకాకాని శివాలయంలో దర్శనానికి వేచి ఉన్న భక్తులు
పెదకాకాని: భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం కార్తిక దీప కాంతుల్లో తళుకులీనింది. కార్తికమాసం చివరి ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. కార్తిక దీపాలు వెలిగించారు. ఆలయ సహాయ కమిషనర్ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ అమ్మిశెట్టి శివశంకరరావు, పాలకవర్గం సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. తెల్లవారు జామునే ఆలయ ప్రాంగణంలో ఉన్న యజ్ఞాల బావి నీటితో భక్తులు పవిత్రస్నానాలు ఆచరించారు. కార్తిక దీపాలు వెలిగించారు. పొంగలి నైవేద్యాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భ్రమరాంబ మల్లేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్లలో దాతలు ఉచితంగా వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. స్వామికి ఒక్కరోజులో రూ.8,10,000 ఆదాయం లభించింది. భక్తులందరికీ ఉచిత అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు.
భక్తులతో కళకళలాడిన
పెదకాకాని శివాలయం

మల్లేశ్వరస్వామి