న్యూస్‌రీల్
సందులో ఇరుక్కుపోయి విలవిల
అదే ప్రాంతంలో కొండచిలువ
పది గంటలు శ్రమించి బాలుడిని బయటకు తీసిన అగ్నిమాపక బృందాలు
గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026
బండరాళ్ల మధ్య ..
భువనేశ్వర్ :
నయాగఢ్ జిల్లా కణిపొడా అడవిలో రాతిబండల సందులో ఓ బాలుడి తల ఇరుక్కుపోయింది. బుధవారం తేనె సేకరిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కణిపొడా గ్రామానికి చెందిన బాలుడు శిబా ప్రధాన్ పెద్ద నాన్నతో కలిసి తేనె సేకరించడానికి అడవికి వెళ్లాడు. బండ రాతుల సందులో తేనె తుట్టెను గుర్తించి సేకరించేందుకు ప్రయత్నించగా బాలుడి తల ఇరుక్కుపోయింది. అక్కడే ఉన్న పెద్ద నాన్న కాపాడటానికి శాయశక్తులా చేసిన ప్రయత్నాలు నీరుగారి పోయాయి. పరిస్థితి చేయి దాటినట్లు గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు పరిస్థితి తెలియజేశాడు. గ్రామస్తుల ఉమ్మడి ప్రయత్నాలు ఫలించకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. బాలుడిని రక్షించేందుకు ఒడొగాంవ్, నయాగఢ్ నుంచి 2 యూనిట్ల అగ్ని మాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వారితో కలిసి స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరారు. బాలుడిలో మానసిక స్థైర్యాన్ని ప్రేరేపిస్తు సహాయక చర్యలు చేపట్టారు. ఈ సన్నాహాలు కొనసాగుతుండగా బాలుడి తల ఇరుక్కుపోయిన రాతి సందులో కొండచిలువ చుట్టుకుని ఉన్నట్లు గుర్తించారు. దీంతో పరిస్థితి మరింత సమస్యాత్మకంగా పరిణమించింది. ఈ తరుణంలో అగ్ని మాపక బృందం సుమారు 10 గంటలపాటు శ్రమించి బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బాలుడికి ఆరోగ్య పరీక్షలు చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
సీఎం అభినందనలు..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి స్పందిస్తూ అగ్ని మాపక దళం సమర్ధంతమైన సహాయక చర్యల్ని అభినం్చదించారు.


