‘డబ్బు కట్టినా బావులు తవ్వలేదు’ | - | Sakshi
Sakshi News home page

‘డబ్బు కట్టినా బావులు తవ్వలేదు’

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

జయపురం:

మ పంట పొలాలకు సాగునీటి కోసం ప్రభుత్వ నియమం ప్రకారం తమ వంతు డబ్బు రూ.20 వేలు చొప్పున ఎంతో కాలం కిందట కట్టినా నేటికీ గొట్టపు బావుల తవ్వకాలు జరుపలేదని జయపురం సబ్‌బిజన్‌ కొట్‌పాడ్‌ సమితి ఛతర్ల గ్రామ పంచాయతీ రైతులు శనివారం జయపురం కలెక్టర్‌ను కలసి వినతి పత్రం సమర్పించినట్లు నేడు ‘సాక్షి’కి తెలిపారు. చతర్ల గ్రామ పంచాయతీకి చెందిన 23 మంది రైతులు రూ.20 వేలు చొప్పున సంబంధిత అధికారులకు డబ్బు చెల్లించినట్లు కలెక్టర్‌కు విన్నవించారు. డబ్బు కట్టి ఎంతో కాలం అయినా నేటికీ ఆగు నీటి గొట్టపు బావులు తవ్వకాలు ప్రారంభించలేదని రైతులు కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రంలో ఆరోపించినట్లు తెలిపారు. గొట్టపు బావులు తీయక పోతే తాము కట్టిన డబ్బు తిప్పి ఇవ్వాలని కోరినా అధికారులు జవాబు ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. ఈ విషయం గతంలో కొట్‌పాడ్‌లో జరిగిన జన సునానీ అభియోగ శిబిరంలో తాత్కాలిక కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అయినా నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని వారు ఆరోపించారు. అందుకే మరోసారి తమ సమస్యను విన్నవించామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement