● ప్రశాంతంగా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల ఎన్నికలు
● క్యూ కట్టిన ఓటర్లు
జయపురం: జయపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల ఎన్నికల్లో ఆదివారం ఓటర్లు క్యూ కట్టారు. 21 మంది చాంబర్ డైరెక్టర్లను ఎన్నుకునేందుకు ఓటర్లను గుర్తించి ఓటు వేసేందుకు అనుమతించారు. ప్రజాస్వామ్య బద్ధంగా సీక్రెట్ బెలట్ పద్ధతిలో జరిగిన ఎన్నికలకు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఎన్.ఆనందరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ప్రశాంత వాతావరణంలో జరిగిన ఎన్నికలను ఆనందరావు స్వయంగా పర్యవేక్షించారు. స్థానిక నెహ్రూనగర్‌లో గల చాంబర్ కార్యాలయం ‘వేదిక’లో నిర్వహించిన ఎన్నికల్లో కార్యాలయం బయట అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. 21 మంది డైరెక్టర్ల పదవులకు 36 మంది పోటీ చేశారు. 843 మంది ఓటర్లు ఉంటే 760 మంది ఓటు హక్కును వినియోగించారు.


