సెక్యూరిటీ గార్డుకి తుపాకీతో బెదిరింపు | - | Sakshi
Sakshi News home page

సెక్యూరిటీ గార్డుకి తుపాకీతో బెదిరింపు

Apr 13 2026 7:20 AM | Updated on Apr 13 2026 7:20 AM

యువకుడిని అరెస్టు చేసిన

పోలీసులు

తుపాకీ స్వాధీనం

రాయగడ: స్థానిక జిల్లా కేంద్రాస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిపై ఓ యువకుడు తుపాకీ గురిపెట్టి బెదిరించిన ఘటన సంచలనం సృష్టించింది. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత సెక్యూరిటీ గార్డు పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సదరు పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి జిల్లాలోని కాసీపూర్‌ సమితి మండిబిసి ప్రాంతానికి చెందిన గొవర్ధన్‌ నాయక్‌ కొడుకు ప్రభాత్‌ నాయక్‌గా గుర్తించారు. నిందితుడిని ఆదివారం కోర్టుకు తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. శనివారం స్థానిక జిల్లా కేంద్రాస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా నాగ్‌ కై లాస్‌, రాజు జకకలు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో కొంతమంది వచ్చి తమ బంధువులు పైఅంతస్తులో ఉన్నారని.. వారిని చూడాలని సెక్యూరిటీ గార్డుకు చెప్పాడు. అయితే నిబంధనల ప్రకారం ఒక్కరే లోపలకు వెళ్లే అవకాశం ఉందని.. మిగతా వారిని లోపలకు ప్రవేశించేందుకు అనుమతించనని అభ్యంతరం తెలిపాడు. దీంతో కొపోద్రేక్తుడైన ప్రభాత్‌ నాయక్‌ తన వద్ద ఉన్న తుపాకీని బయటకు తీసి లోనికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపొతే కాల్చివేస్తానని బెదిరించి దౌర్జన్యంగా లోనికి వెళ్లాడు. ఈ విషయమై సెక్యూరిటీ గార్డు నాగ్‌ కై లాస్‌ సదరు పోలీస్‌ స్టేషన్‌లో శనివారం రాత్రి ఫిర్యాదు చేశాడు. ఆస్పత్రిలని సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు ప్రభాత్‌ నాయక్‌ను అరెస్టు చేసి అని వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement