కొరాపుట్: కొరాపుట్ జిల్లా పోలీసులు 22 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం కొరాపుట్ నందపూర్ సమితి పాడువా పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఎస్‌డీపీవో దేవేంద్ర కుమార్ మాలిక్ కేసు వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు దేవతీగుడ అటవీ ప్రాంతంలో దాడులు చేపట్టామన్నారు. రవాణా కోసం సిద్ధంగా 180 బస్తాల్లో ఉంచిన గంజాయిని తమ సిబ్బంది గుర్తించరన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీస్‌స్టేషన్‌కి తరలించి తూకం వేయగా 22 క్వింటాళ్లు ఉందన్నారు. దీని విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుందని ప్రకటించారు. మెజిస్ట్రేట్ సమక్షంలో సీజ్ చేసి కోర్టుకి నివేదించామన్నారు. గంజాయి స్మగ్లర్ల కోసం గాలింపులు చేస్తున్నామని ఎస్‌డీపీవో ప్రకటించారు.


