138 మందికి గృహ నిర్మాణాలు | - | Sakshi
Sakshi News home page

138 మందికి గృహ నిర్మాణాలు

Apr 11 2026 9:10 AM | Updated on Apr 11 2026 9:10 AM

138 మందికి గృహ నిర్మాణాలు

జయపురం: ఒడిశా ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి విభాగం అనుమతి మేరకు 138 మంది లబ్ధిదారులకు ప్రధాన మంత్రి అవాస్‌ యోజన పథకంలో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను స్థానిక బాబా సాహేబ్‌ కల్యాణ మండపంలో శుక్రవారం జయపురం మున్సిపల్‌ అధికారులు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జయపు రం ఎమ్మెల్యే తారా ప్రసాద్‌ బాహిణీపతి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రధా న మంత్రి అవాస్‌ యోజన పథకంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలు అందజేశామన్నారు. జయపురం మున్సిపాలిటీ పరిధిలో నాలుగు వేలకు పైగా లబ్ధిదారుల జాబితా తయారీ చేసి మంజూరు చేయటం జరిగిందన్నారు. వారిలో 3,400 మంది ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారన్నారు. ప్రస్తుతం పత్రాలుపొందిన వారు కూడా సకాలంలో గృహ నిర్మాణాలు చేపట్టాలన్నారు. మున్సిపల్‌ చైర్మ న్‌ నరేంద్రకుమార్‌ మహంతి, వైస్‌ చైర్మన్‌ బి.సునీ త, మున్సిపల్‌ కార్యనిర్వాహక అధికారి పూజా రౌ త్‌, కౌన్సిలర్లు, మునిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement