భువనేశ్వర్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్ గురువారం ఆకస్మికంగా స్థానిక మైత్రి విహార్‌లోని విద్యుత్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయం సందర్శించారు. ఇటీవల ఈ కార్యాలయంలో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు వెలుగు చూడడంతో ఆయన విజిలెన్స్ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉప ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3.15 గంటలకు సందర్శించిన వేళలో కార్యాలయంలో ఏ ఉద్యోగి కనిపించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరు సిబ్బంది వ్యతిరేకంగా తక్షణ చర్యకు ఆదేశాలు జారీ చేశారు.


