సరికొత్త సొబగులతో ..
భువనేశ్వర్:
రైలు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు అమృత్ భారత్ రైలు బోగీలు సరికొత్త సొంపులతో ప్రత్యక్షం కానున్నాయి. ఆకట్టుకునే రంగుల మేళవింపుతో ప్రతిపాదిత అంతర్గత డిజైన్ నమూనా కోచ్ సిద్ధమైంది. పీవీసీ ఫ్లోరింగ్, సీటు, బెర్త్ రెక్సిన్, స్నాక్ టేబుల్స్, కర్టెన్లు, లావెటరీ ప్రాంతాలు వంటి కీలక భాగాలలో సమన్వయ రంగులను పొందుపరిచి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ బోగీలను విభిన్నమైన అంతర్గత రంగుల థీమ్‌లతో అమర్చారు. ప్రయాణికుల అధిక స్థాయి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆకర్షణీయమైన రూపకల్పనలో వీటిలో హెచ్‌ఎల్ 3 అగ్ని మాపక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సామగ్రి వినియోగించారు.


