బీజేడీ పార్టీలోకి బోడోగుడా గ్రామస్తులు | - | Sakshi
Sakshi News home page

బీజేడీ పార్టీలోకి బోడోగుడా గ్రామస్తులు

Apr 8 2026 7:08 AM | Updated on Apr 8 2026 7:08 AM

పర్లాకిమిడి: గుమ్మా బ్లాక్‌ పోరిడా గ్రామపంచాయతీ పరిధి బోడోగుడా గ్రామానికి చెందిన 40 మంది బీజేపీకి గుడ్‌బై చెప్పి బీజేడీ పార్టీలో చేశారు. వీరంతా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రదీప్‌ నాయక్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రూపేష్‌ సమక్షంలో బీజేడీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామంలో గ్రామసభ నిర్వహించి బీజేడీ పార్టీలో చేరినట్టు ప్రదీప్‌ నాయక్‌ తెలియజేశారు. ఈ మిశ్రణ్‌ పర్వ్‌లో జిల్లా పరిషత్‌ అధ్యక్షులు గవర తిరుపతిరావు, మహిళా అధ్యక్షురాలు సంయుక్తా బెహారా, యువజన ప్రెసిడెంటు (బీజేడీ) లెంక సిమ్మాద్రి, సిమాన్‌ మండళ్‌, రమేష్‌ బాబు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement