ముగిసిన బంగారమ్మతల్లి ప్రతిష్టోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన బంగారమ్మతల్లి ప్రతిష్టోత్సవాలు

Apr 7 2026 8:25 AM | Updated on Apr 7 2026 8:25 AM

రాయగడ: సదరు సమితి కొత్తపేట వద్ద గ్రామదేవతగా పూజలందుకుంటున్న బంగారమ్మతల్లి మందిర, విగ్రహ ప్రతిష్టోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఈ నెల నాలుగో తేదీ నుంచి కొనసాగిన ప్రతిష్టోత్సవాల్లో భాగంగా చివరి రోజున అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, చండీహోమ పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు సామూహిక కుంకుమార్చన పూజలను వీరఘట్టం నుంచి వచ్చిన ప్రముఖ యజ్ఞయుగకర్త ఎస్‌ఎల్‌వీఎన్‌ శర్మయాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కొత్తపేట ప్రముఖులు పెద్దీన మురళి, పొట్నూరు మణిరత్నం, సతీష్‌ కుమార్‌, తపన్‌ కుమార్‌, ప్రసాద్‌ హుయిక, కిశోర్‌కుమార్‌, నకిన గౌరి, ముర్రా ప్రసాద్‌, మోహన్‌ సాహుల నేతృత్వంలో ఉత్సవాలు జరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement